Zero Tax : మిడిల్ క్లాసుకు బిగ్ రిలీఫ్.. రూ. 15 లక్షలకు పైగా సంపాదించినా ఒక్క పైసా TAX కట్టనక్కర్లేదు.. జీరో టాక్స్ లెక్కలివే..!
Zero Tax : రూ. 15 లక్షలకు పైగా సంపాదించినా పైసా కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. మిడిల్ క్లాసు వారికి కొత్త పన్ను విధానంతో భారీ రిలీఫ్ అనే చెప్పాలి.. రూ. 12 లక్షల లోపే ఆదాయాన్ని ఎలా చూపించుకోవచ్చు? జోరో టాక్స్ పరిధిలో ఎలా వస్తారో ఇప్పుడు చూద్దాం..
Zero Tax
- రూ. 15 లక్షలకు పైగా సంపాదించినా జీరో టాక్స్ పరిధిలోకి
- కొత్త పన్ను విధానంతో మధ్యతరగతి వారికి భారీ ఊరట
- మీల్ ఓచర్లపై ఎలాంటి పన్ను ఎందుకు ఉండదంటే?
Zero Tax : మధ్యతరగతివారికి నిజంగా శుభవార్తే.. రూ. 15 లక్షలకు పైగా సంపాదించినా పైసా కూడా పన్ను కట్టనక్కర్లేదు అంటే.. ఎవరికైనా ఆనందమే కదా.. పాత పన్ను విధానంలో మధ్యతరగతి వారికి పన్నుల ఆదా అనేది పెద్ద సవాల్. కానీ, 2026-27 ఆర్థిక సంవత్సరానికి కొత్త పన్ను నిబంధనల మార్పుతో మధ్యతరగతివారికి భారీగా ప్రయోజనం చేకూరుతుంది.
మీ జీతం రూ. 15 లక్షలకు పైగా ఉందా? అధిక పన్నులు కట్టాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారా? బడ్జెట్ 2026-27లోని కొత్త నిబంధనలు మధ్యతరగతి వారికి బిగ్ రిలీఫ్ అందించాయి. మీల్ వోచర్లు, ఇతర పెట్టుబడుల ద్వారా ఇప్పుడు రూ. 15.85 లక్షల ఆదాయంపై కూడా జీరో టాక్స్ కావచ్చు. పూర్తి లెక్కలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పుడు, రూ. 15 లక్షల కన్నా ఎక్కువ వార్షిక సీటీసీ ఉన్నవారు కూడా పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని రూ.12 లక్షల పరిమితి కన్నా తక్కువకు తగ్గించుకోవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం.. మీల్ వోచర్లు కీలక పాత్ర పోషించాయి. పన్ను భారాన్ని పూర్తిగా తొలగించుకునేందుకు వీలు కల్పిస్తున్నాయి.
పన్ను ఆదాకు కొత్త మార్గం :
కొత్త పన్ను విధానం (సెక్షన్ 115BAC) ప్రకారం.. ఒక్కో భోజనానికి రూ. 200 వరకు ఉండే మీల్ వోచర్లపై ఇప్పుడు పన్ను ఉండదు. మీ కంపెనీ మీకు మధ్యాహ్న, రాత్రి భోజనం రెండింటికీ రోజూ రూ. 400 వోచర్లను అందిస్తే.. మీరు 22 రోజులు వర్క్ చేస్తే నెలలో రూ. 8,800 ఆదా చేసుకోవచ్చు. ఏడాదికి రూ. 1,05,600 అవుతుంది. ఈ మొత్తం మీ స్థూల జీతం నుంచి నేరుగా తొలగిస్తారు. ఈ కూపన్లతో అద్భుతమైన సేవింగ్స్ పొందవచ్చు.
రూ. 3.86 లక్షల తగ్గింపు లెక్కలివే :
మీ CTC రూ. 15.85 లక్షలైతే.. ఈ 4 మార్గాలలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకోవచ్చు
స్టాండర్డ్ డిడెక్షన్ : కొత్త విధానం కింద ఫ్లాట్ రూ. 75,000 మినహాయింపు
కంపెనీ చెల్లించే పీఎఫ్ వాటా : కనీస వేతనంలో 12శాతం అంటే సుమారుగా రూ. 95,100 పన్ను రహితం.
NPS (80CCD(2)): కంపెనీ ప్రాథమిక వాటాలో 14శాతంపై పన్ను లేదు. సుమారుగా రూ. 1,10,950.
మీల్స్ వోచర్లు : సంవత్సరానికి రూ. 1,05,600 నేరుగా తగ్గింపు
ఇవన్నీ కలిపితే, మీ మొత్తం తగ్గింపు రూ. 3,86,650 అవుతుంది.
రూ. 12 లక్షలపైనా జీరో టాక్స్ :
కొత్త ఆదాయపు పన్ను శాఖ రూల్స్ ప్రకారం.. మీ మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 12 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే రిబేట్ కారణంగా మీరు చెల్లించాల్సిన పన్ను జీరోగా ఉంటుంది.
రూ. 15.85 లక్షల నుంచి పైన పేర్కొన్న రూ. 3.86 లక్షల మినహాయింపును తీసివేస్తే.. మీ నికర ఆదాయం రూ. 11.98 లక్షలు అవుతుంది. మీరు రూ. 12 లక్షల పరిమితిలోనే ఉంటారు. అంటే.. ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. మధ్యతరగతి ప్రజలకు నిజంగా బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి.
