Twitter: అరచేతిలో ఉన్న ట్విటర్ గంటల తరబడి చూడడం కష్టం. ఇక అంత సేపు యాప్‌లో చూడలేక ట్విటర్లో వచ్చే వీడియో కంటెంట్‌ను స్కిప్ చేస్తుంటారు. అయితే ఇక నుంచి ఈ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్విటర్ వీడియోలను ఇక నుంచి ఎంచక్కా టీవీలో చూసుకోవచ్చు. వాస్తవానికి ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు కానీ, వీలైనంత తొందరలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పని చేస్తున్నట్లు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ వెల్లడించారు.
500 Rupees Notes : మనీ మిస్సింగ్ మిస్టరీ.. రూ.88వేల కోట్ల విలువైన 500నోట్లు ఏమయ్యాయి?
సోషల్ మీడియాలో వీడియో కంటెంట్ ప్రాధాన్యం బాగా పెరిగిపోతోంది. ఈ విషయంలో యూట్యూబ్ టాప్‌లో ఉంది. ఇప్పటి వరకు యూట్యూబ్ దరిదాపుల్లో కూడా ఏ సోషల్ మీడియా సంస్థ లేదు. అయితే వీడియో కంటెంట్ వ్యూస్ పెంచుకోవడం కోసం చాలా సంస్థలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ట్విట్టర్ సైతం ప్రణాళికలు రచిస్తోంది. సోషల్ మీడియా భవిష్యత్ అంతా వీడియో కంటెంట్ మీదే ఉంటుందని విశ్లేషణలు వచ్చిన నేపథ్యంలో, ఆ విషయంలో ముందుండాలని అందరూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
America President Elections: అమెరికాలో బైడెన్‌కు ఎదురుగాలి.. అది నిజమే అయితే వచ్చే ఎన్నికల్లో ఓటమే
ఇక ఎలాన్ ప్రకటనపై ధన్యవాదాలు తెలిపిన ఒక నెటిజెన్.. తాను ఈ క్షణమే యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడించాడు. కారణం అక్కడ కేవలం వీడియోలు మాత్రమే ఉంటాయి. కానీ ట్విటర్లో కంటెంట్‌తో పాటు వీడియోలు కూడా అందుబాటులో ఉండడంతో ఎక్కువ మంది ఇటువైపు మొగ్గు చూపుతున్నారట. అందుకే వీడియోలు చూసేలా యూజర్లకు సులభతరం చేసేందుకు పని చేస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో మస్క్ పేర్కొన్నారు.