500 Rupees Notes : మనీ మిస్సింగ్ మిస్టరీ.. రూ.88వేల కోట్ల విలువైన 500నోట్లు ఏమయ్యాయి?

500 Rupees Notes : ఒకటి కాదు రెండు కాదు అచ్చు అయిన రూ.500 నోట్లలో 176 కోట్ల నోట్లు లెక్కల్లోకి రాకుండా పోయాయి.

500 Rupees Notes : మనీ మిస్సింగ్ మిస్టరీ.. రూ.88వేల కోట్ల విలువైన 500నోట్లు ఏమయ్యాయి?

500 Rupees Notes Missing

Updated On : June 18, 2023 / 7:10 PM IST

500 Rupees Notes Missing : మన దేశ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లలో ముద్రితమవుతున్న కరెన్సీ నోట్ల లెక్కలు తప్పుతున్నాయి. ఆర్బీఐకి చేరాల్సిన 500 రూపాయల నోట్లకు రెక్కలొచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ కు చేరకుండా దారి మళ్లుతున్నాయనే అంశంపై వాడీవేడిగా చర్చ సాగుతోంది. కరెన్సీ ముద్రణాలయాల నుంచి మన ఆర్థిక వ్యవస్థలోకి రావాల్సిన కొత్త రూ.500 నోట్లు మాయమైపోయాయి.

ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు అచ్చు అయిన రూ.500 నోట్లలో 176 కోట్ల నోట్లు లెక్కల్లోకి రాకుండా పోయాయి. వీటి విలువ రూ.88వేల కోట్లు ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. 2016-17లో ప్రింట్ అయిన ఈ నోట్లు ఆర్బీఐకి చేరకుండా ఎక్కడికి పోయాయి అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం ఎవరి చేతుల్లోకి వెళ్లిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

Also Read..Drinking Alcohol: దావత్‌లో బిజీగా ఉన్నారా.. అయితే జాగ్రత్త.. మందేస్తే అంతే సంగతులు!

మన దేశంలో మూడు సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లలో ఈ నోట్ల ముద్రణ జరుగుతుంది. బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్, నాసిక్ లోకి కరెన్సీ నోట్ ప్రెస్, మధ్యప్రదేశ్ దేవస్ లోని బ్యాంక్ నోట్ ప్రెస్ లో 500 రూపాయలు కరెన్సీ నోట్లు అచ్చు అయ్యాయి. 2016 నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు జరిగింది. అంతకుముందు నుంచే నాసిక్ ప్రెస్ లో కొత్త 500 రూపాయల నోట్ల ముద్రణ జరిగింది. 2015 ఏప్రిల్ -2016 డిసెంబర్ మధ్య కాలంలో ఈ ప్రెస్ లో ముద్రితమైన నోట్లకు, ఆర్బీఐకి చేరిన నోట్ల సంఖ్యకు వ్యత్యాసం బయటపడింది. ఈ విషయం ఆర్టీఐ చట్టం ద్వారా వెలుగుచూసింది.

2015 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబర్ వరకు నాసిక్ ప్రెస్ లో 37.54 కోట్ల మేర రూ.500 నోట్లు ప్రింట్ అయ్యాయి. వాటిలో 34.5 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు మాత్రమే ఆర్బీఐకి చేరాయి. మిగిలిన నోట్లు ఇప్పుడు ఎక్కడికిపోయాయి? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక, 2016-17 మధ్య కాలంలో కూడా నాసిక్ ప్రెస్ ద్వారా 166.20 కోట్లు, బెంగళూరు నోట్ల ముద్రణాలయం ద్వారా 519.56 కోట్ల 500 రూపాయల నోట్లు ప్రింట్ అయ్యాయి. మధ్యప్రదేశ్ లోని దేవస్ బ్యాంక్ నోట్ ప్రెస్ ద్వారా 195.30 కోట్ల మేర 500 రూపాయల నోట్ల ముద్రణ జరిగింది. ఈ మూడింటి నుంచి 881.67 కోట్ల మేర కొత్త 500 రూపాయల నోట్లను ముద్రించగా, వాటిలో 726 కోట్ల నోట్లు మాత్రమే ఆర్బీఐకి చేరాయి.

Also Read..Eating Dinner Early : రాత్రి భోజనం త్వరగా ముగించటం వల్ల బరువు తగ్గటం, నిద్రబాగా పట్టటంతోపాటు అనేక ప్రయోజనాలు !

ఇక.. 2015-17 మధ్య కాలంలో ముద్రితమైన 500 రూపాయల నోట్లలో 176 కోట్లకు పైగా ఆర్బీఐకి చేరలేదని బయటపడింది. వాటి విలువ 88వేల 32 కోట్లని అంచనా వేసింది. ఈ వివరాలను సేకరించిన మనోరంజన్ రాయ్ మొత్తం వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు లేఖ రాశారు.

నోట్ల మిస్సింగ్ పై ఆర్బీఐ స్పందించింది. అందులో వాస్తవం లేదని వివరణ ఇచ్చింది. ఆర్టీఐ ద్వారా అందిన సమాచారాన్ని తప్పుగా అన్వయించారని ప్రకటించింది.