Elon Musk : ఎలాన్ మస్క్‌కు బిగ్‌షాక్ .. ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానం నుంచి ఔట్
భారతీయ సంపన్నుల విషయానికి వస్తే.. ప్రపంచ కుబేరులో జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీలు ..

Elon Musk and Mark Zuckerberg
World Richest Person: టెస్లా సీఈఓ, స్పేస్ఎక్స్ యాజమాని ఎలాన్ మస్క్‌కు బిగ్‌షాక్ తగిలింది. సుదీర్ఘకాలంగా (దాదాపు తొమ్మిది నెలలుగా) ప్రపంచంలో కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ఎలాన్ మస్క్ కొనసాగుతూ వస్తున్నారు. తాజాగా ఆ స్థానాన్ని మస్క్ కోల్పోయాడు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. టెస్లా కంపెనీ షేర్లు 7.2శాతం కుప్పకూలిపోవడంతో ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్ రెండో స్థానంకు పడిపోయాడు. ప్రస్తుతం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 200 బిలియన్ డాలర్ల సంపదతో తొలి స్థానంలో కొనసాగుతుండగా.. మస్క్ 198 బిలియన్ డాలర్లు సంపదతో రెండో స్థానంలో నిలిచాడు.
Also Read : Elon Musk vs Sam Altman : ఓపెన్ ఏఐని టార్గెట్ చేసిన మస్క్.. సామ్ ఆల్ట్‌మన్‌పై దావా!
ప్రపంచ కుబేరుల జాబితాలో వెనకపడిపోవటానికి ప్రధాన కారణాల్లో.. గ్లోబల్ మార్కెట్లలో మస్క్ కంపెనీ టెస్లా షేర్లలో భారీ పతకం కావడం. టెస్లా షేర్లు 118.14 డాలర్ల ధరకు 7.2 శాతం పడిపోయాయి. ఇది కంపెనీ నికర విలువతో పాటు మస్క్ నికర విలువను ప్రభావితం చేసింది. ఈ కారణంగా మస్క్ నికర విలువ కేవలం 24 గంటల్లో 17.6 బిలియన్ డాలర్లు తగ్గింది. దీంతో గత తొమ్మిది నెలలుగా ప్రపంచ కుబేరుల జాబితాలో నెం.1 స్థానంలో కొనసాగుతూ వస్తున్న మస్క్.. తాజాగా రెండో స్థానంకు పడిపోయాడు.
Also Read : Elon Musk Xmail : జీమెయిల్‌కు పోటీగా ‘ఎక్స్’మెయిల్ వస్తోంది.. ఎలన్ మస్క్ మళ్లీ వేసేశాడుగా..!
భారతీయుల విషయానికి వస్తే.. ప్రపంచ కుబేరు జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ (115 బిలయన్ డాలర్లు) 11వ స్థానంలో ఉండగా.. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (104 బిలియన్ డాలర్లతో) 12వ స్థానంలో ఉన్నారు. ఇక బెర్నార్డ్ ఆర్నాల్ట్ (197 బిలియన్ డాలర్లు), నాల్గో స్థానంలో మార్క్ జుకర్ బర్గ్ (179 బిలియన్ డాలర్లు), ఐదో స్థానంలో బిల్ గేట్స్ (150 బిలియన్ డాలర్లు) కొనసాగుతున్నారు.