×
Ad

EPFO ATM Withdrawals : పీఎఫ్ ఖాతాదారులకు పండగే.. ఇక ఏటీఎం ద్వారా PF డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.. ఎప్పటినుంచంటే?

EPFO ATM Withdrawals : EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు అక్టోబర్ రెండవ వారంలో జరిగే బోర్డు సమావేశంలో ATM-విత్‌డ్రాయల్ సౌకర్యానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

EPFO ATM Withdrawals

EPFO ATM Withdrawals : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPF) ఖాతాదారులు జనవరి 2026 నుంచి తమ పీఎఫ్ డబ్బులను నేరుగా ఏటీఎంల నుంచే విత్‌డ్రా చేసుకునే అవకాశం రానుంది. పీఎఫ్ ఖాతాదారులు తమ డిపాజిట్లలో కొంత మొత్తాన్ని ఏటీఎంల ద్వారా విత్ డ్రా చేసుకునేలా అనుమతించడంపై ఈపీఎఫ్ఓ పరిశీలిస్తోంది.

నివేదిక ప్రకారం.. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) అక్టోబర్ రెండో వారంలో జరిగే (EPFO ATM Withdrawals) సమావేశంలో ఈ సౌకర్యాన్ని ఆమోదించే అవకాశం ఉంది. ఈపీఎఫ్ఓ ఐటీ మౌలిక సదుపాయాలు ఇప్పుడు అలాంటి లావాదేవీలకు రెడీగా ఉన్నాయని సీబీటీ సభ్యులు ఒకరు తెలిపారు. అయితే, ఏటీఎం విత్‌డ్రా పరిమితి ఇంకా ఖరారు చేయలేదు. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ​​మొత్తం రూ. 28 లక్షల కోట్లకుపైగా ఫండ్ కలిగి ఉంది. సుమారు 78 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు.

2014లో ఈ గణాంకాలు వరుసగా రూ. 7.4 లక్షల కోట్లు, 33 మిలియన్ల మంది సభ్యులుగా ఉన్నాయి. పీఎఫ్ సభ్యులకు తమ డిపాజిట్లను సులభంగా యాక్సెస్ చేసేందుకు ఈ సౌకర్యం చాలా అవసరమని కార్మిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మంత్రిత్వ శాఖ బ్యాంకులు, ఆర్బీఐతో కూడా చర్చలు జరుపుతోంది.

ఈపీఎఫ్ఓ స్పెషల్ కార్డు జారీ :

నివేదికల ప్రకారం.. ఈపీఎఫ్ఓ తమ పీఎఫ్ సభ్యులకు ప్రత్యేక ఏటీఎం కార్డులను జారీ చేయవచ్చు. తద్వారా తమ ఫండ్స్‌లో కొంత మొత్తాన్ని ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ సౌకర్యం పీఎఫ్ సభ్యులు నిధులను యాక్సెస్ చేసేందుకు చాలా ఈజీగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌకర్యం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం, పీఎఫ్ విత్‌డ్రా చేసే సమయంలో క్లెయిమ్‌లను దాఖలు చేయడం, ప్రాసెసింగ్ కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది. అయితే, ఇకపై ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈపీఎఫ్ఓ ఏటీఎం విత్ డ్రా ప్రాసెస్ పూర్తి చేయొచ్చు.

Read Also : New Aadhaar App : కొత్త ఇ-ఆధార్ యాప్ వస్తోంది.. ఇకపై ఇంట్లో నుంచే అన్ని మీ ఫోన్‌లో అప్‌డేట్ చేయొచ్చు.. ఆ ఒక్కటి తప్ప..!

ప్రస్తుతం ఈపీఎఫ్ఓ దాదాపు రూ.27 లక్షల కోట్ల కార్పస్‌ను కలిగి ఉంది. సావరిన్ గ్యారెంటీతో 8.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల కంపెనీలు దాఖలు చేసిన 1.25 కోట్ల ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్‌లు (ECR) ద్వారా రూ.3.41 లక్షల కోట్లకు పైగా ఫండ్స్ సేకరించింది.

గత వారమే కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ, ఈపీఎఫ్ఓ సభ్యుల కోసం పారదర్శకమైన యూజర్ ఫ్రెండ్లీ సేవలను అందించేలా కీలక సంస్కరణలను ప్రకటించారు. పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ పారదర్శకత కోసం Annexure K (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్)కి ఆన్‌లైన్ యాక్సెస్ సౌకర్యాన్ని కూడా మంత్రి ప్రారంభించారు.

పాస్‌బుక్ లైట్ సదుపాయం :
ఈపీఎఫ్ఓ సెప్టెంబర్ 18న సభ్యుల పోర్టల్‌లో ‘పాస్‌బుక్ లైట్’ అనే కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా సభ్యులు తమ పాస్‌బుక్‌ను డిపాజిట్స్, విత్ డ్రాలు, బ్యాలెన్స్ సంబంధించి అన్ని ఒకేచోట యాక్సస్ చేయొచ్చు. పోర్టల్ ద్వారా ఈజీ ఫార్మాట్‌లో చెక్ చేసుకోవచ్చు.

ప్రత్యేకించి పాస్‌బుక్ పోర్టల్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం, ఉద్యోగులు ఉద్యోగాలు మారినప్పుడు వారి PF అకౌంట్లు ఫారమ్ 13 ఆన్‌లైన్ ద్వారా కొత్త కంపెనీ పీఎఫ్ ఆఫీసుకు ట్రాన్స్ ఫర్ అవుతాయి. ఆ తర్వాత, పాత PF ఆఫీసు ద్వారా ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. అది కొత్త PF ఆఫీసుకు పంపుతారు.

ఇప్పటివరకు, Annexure K అనేది పీఎఫ్ ఆఫీసుల మధ్య మాత్రమే షేర్ అయ్యేది. సభ్యుల అభ్యర్థనపై మాత్రమే వారికి అందుబాటులో ఉంది. ప్రస్తుతం, పీఎఫ్ ట్రాన్స్‌ఫర్, సెటిల్‌మెంట్లు, అడ్వాన్సులు, రీఫండ్‌లు వంటి ఏవైనా ఈపీఎఫ్ఓ ​​సేవలకు ఉన్నత స్థాయి అధికారుల (RPFC/ఆఫీసర్-ఇన్-ఛార్జ్) ఆమోదాలు అవసరం. ఈ మల్టీ లెవల్ అప్రూవల్ ప్రాసెస్ ప్రక్రియ తరచుగా సభ్యుల క్లెయిమ్‌లకు ఆలస్యం, ప్రాసెసింగ్ పూర్తి అయ్యేవరకు ఎక్కువ సమయం పడుతుంది. ఇకపై అలాంటి సమస్య ఉండదు.