EPFO : ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై మీ పేరులో మార్పు, అకౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ చాలా ఈజీ!

EPFO : ఈపీఎఫ్ఓ ఆటోమేటిక్ ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌తో అకౌంట్ ట్రాన్స్‌ఫర్ విధానాన్ని మరింత సులభతరం చేసింది.

EPFO : ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై మీ పేరులో మార్పు, అకౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ చాలా ఈజీ!

Transfer EPF Account

Updated On : January 19, 2025 / 8:55 PM IST

EPFO : ఉద్యోగాలు మారడం అనేది ఒత్తిడితో కూడుకున్నది మాత్రమే కాదు. మీ పాత ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌ను మీ మునుపటి కంపెనీ నుంచి మీ కొత్త కంపెనీకి మార్చుకోవడం  గురించి కూడా ఆందోళన చెందుతుంటారు. అన్ని కొత్త పేపర్‌వర్క్‌లు, మీ కొత్త ఉద్యోగానికి మార్చుకోవడం పెద్ద ప్రాసెస్ అని భావిస్తుంటారు.

డోంట్ వర్రీ.. ఈ సమస్యను ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌ఓ ( EPFO) కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే.. ఆటోమేటిక్ ఈపీఎఫ్ బదిలీ ఫీచర్.. ఈ కొత్త ఫీచర్ సాయంతో పీఎఫ్ ఖాతాదారుల పేరు, పుట్టిన తేదీ వంటి ఇతర వివరాలను మార్చుకునేందుకు అవకాశాన్ని అందిస్తుంది.

Read Also : Realme P3 5G Leak : రియల్‌మి P3 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆటోమేటిక్ ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌తో అకౌంట్ ట్రాన్స్‌ఫర్ విధానాన్ని మరింత సులభతరం చేసింది. ఈ ప్రాక్టికల్ ఫీచర్ సాయంతో ఎలాంటి ఫారమ్‌లను నింపాల్సిన అవసరం లేకుండా మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎంప్లాయర్ల మధ్య సజావుగా ట్రాన్స్‌ఫర్ చేసేందుకు వీలుంటుంది.

అదనంగా, మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఉద్యోగాల అంతటా మీ యూనివర్సల్ ఖాతా నంబర్ (UAN) నిర్వహించడం ద్వారా ఒకే అకౌంటులో మెర్జ్ అవుతుంది. మీ పదవీ విరమణ సేవింగ్స్ కూడా సులభంగా ట్రాక్ చేస్తుంది. మీ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ స్టేటస్ గురించి మీకు తెలిసేలా ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ అప్‌డేట్‌లతో ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుంది.

ఈపీఎఫ్ఓ ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్ ఫెసిలిటీ వివరాలివే :
మీరు ఉద్యోగాలను మారినప్పుడు ఈపీఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్ మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ని మీ మునుపటి ఎంప్లాయర్ నుంచి మీ కొత్తదానికి ట్రాన్స్‌ఫర్ సులభంగా ఉండేలా చేస్తుంది. కొత్త సాంకేతికతతో ఈపీఎఫ్ఓ ద్వారా ఈ సర్వీసు అమలుతో ఉద్యోగులు ఇకపై వారి ఈపీఎఫ్ఓ నిధుల బదిలీకి మాన్యువల్‌గా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.

దానికి బదులుగా, మీరు యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని మీ కొత్త యజమానికి లింక్ చేసినప్పుడు బదిలీ ఇప్పుడు ఆటోమాటిక్‌గా ప్రారంభమవుతుంది. మీ కెరీర్ మొత్తంలో మీ ఈపీఎఫ్ అకౌంట్ స్థిరంగా ఉంటుంది. తద్వారా మీ రిటైర్మెంట్ ఫండ్‌లను సులభంగా నిర్వహించవచ్చు.

ఆటోమాటిక్ ట్రాన్స్‌ఫర్ ఫెసిలిటీ.. ఇదేలా పనిచేస్తుందంటే? :
యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) : ప్రతి ఈపీఎఫ్ సభ్యునికి ఒక ప్రత్యేకమైన యూఏఎన్ నెంబర్ ఉంటుంది. ఉద్యోగి తన ఉద్యోగ కాల వ్యవధిలో గుర్తించే కీలకమైన టూల్‌గా పనిచేస్తుంది. ఎన్ని ఉద్యోగాలు మారినప్పటికీ UAN మాత్రం మారదు.
కొత్త ఎంప్లాయర్ రిజిస్ట్రేషన్ : మీరు కొత్త ఆఫీసులో చేరినప్పుడు మీ ఎంప్లాయర్ మీ యూఏఎన్ వారి కంపెనీ కింద ఉన్న ఈపీఎఫ్ఓ సైట్‌లో ఎంటర్ చేస్తారు. మీ ప్రస్తుత యూఏఎన్ మీ కొత్త ఉద్యోగ సమాచారంతో అప్‌డేట్ అవుతుంది.
ఆటోమాటిక్ ట్రాన్స్‌ఫర్ ట్రిగ్గర్: మీ కొత్త యజమాని మీ యూఎఎన్ ఎంటర్ చేసిన వెంటనే ఈపీఎఫ్ఓ ​సిస్టమ్ మీ మాజీ ఎంప్లాయర్ నుంచి ప్రస్తుత మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను బదిలీ చేసుకోవచ్చు.
ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా సమాచారం : ఈపీఎఫ్ఓ బదిలీ అభ్యర్థన వెంటనే మీ యూఏఎన్‌తో అనుబంధించిన ఇమెయిల్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా ట్రాన్స్‌ఫర్ స్టేటస్ తెలియజేస్తుంది.
బదిలీ : ఎలాంటి మాన్యువల్ ప్రమేయం లేకుండా మీ మునుపటి ఎంప్లాయర్ నుంచి ఈపీఎఫ్ బ్యాలెన్స్ కొన్ని రోజుల్లో మీ కొత్త ఈపీఎఫ్ ఖాతాకు బదిలీ అవుతుంది.

ఆటోమాటిక్ ట్రాన్స్‌ఫర్ సౌకర్యం : దిగువన ఉన్న ఈ షరతులు తప్పక పాటించాలి.

  • మీ యూఏఎన్ యాక్టివ్‌గా ఉండాలి. మీ మునుపటి, ప్రస్తుత ఉద్యోగాల్లో పనిచేస్తుండాలి.
  • మీ UAN వెరిఫికేషన్ కోసం తప్పనిసరిగా ఆధార్‌ని ఉపయోగించాలి.
  • మీ ఐడెంటిటీ అన్ని యజమానులచే ధృవీకరించి ఉండాలి. అప్పుడే నిధుల బదిలీ సులభంగా జరుగుతుంది.
  • అప్‌డేట్‌లు, నోటిఫికేషన్‌లు, మీ ఇమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్ మీ UAN కనెక్ట్ అయి ఉండాలి.
  • మీ UAN కచ్చితంగా మ్యాప్ అయి మునుపటి ఈపీఎఫ్ అకౌంటుకు అవసరమైన కేవైసీ సమాచారంతో అప్‌డేట్ చేయాలి.
  • ఈ అవసరాలు ఏవైనా తీరకపోతే బదిలీ అభ్యర్థనను ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా మాన్యువల్‌గా చెక్ చేసుకోవచ్చు.

మీ ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ స్టేటస్ చెక్ చేయాలంటే? :
1) ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్‌కి మీ యూఏఎన్ (UAN), పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి.
2) ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ కోసం మీ రిక్వెస్ట్ స్టేటస్ తెలిపే పోర్టల్ “Track Claim Status” ఆప్షన్‌కు వెళ్లండి.
3) మీ పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ పురోగతిపై ఈపీఎఫ్ఓ నుంచి అప్‌డేట్‌ల కోసం, మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ అడ్రస్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను చెక్ చేసుకోండి.

Read Also : TikTok Ban : అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం.. నిలిచిపోయిన సర్వీసులు.. ట్రంప్ నిర్ణయంపైనే కంపెనీ ఆశలు..!