MG Motor Sale 2025 : కొత్త MG కారు కొనేందుకు సువర్ణావకాశం.. ఈ కార్లపై రూ.4 లక్షల వరకు బెనిఫిట్స్.. ఏ మోడల్ ధర ఎంత తగ్గిందంటే?
MG Motor Sale 2025 : ఇయర్ ఎండ్ సేల్స్ సందర్భంగా ఎంజీ మోటార్ ఇండియా డీలర్‌షిప్ లెవల్‌లో కార్లపై రూ. 50వేల నుంచి రూ. 4 లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
MG Motor Sale 2025
MG Motor Sale 2025 : ఎంజీ కారు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. డిసెంబర్ నెలలో కొత్త కారు కొంటున్నారా? అయితే, ఇది మీకోసమే.. ఇయర్ ఎండ్ సేల్స్ సందర్భంగా కస్టమర్లు బంపర్ బెనిఫిట్స్ పొందవచ్చు. అనేక ఆటో కంపెనీలు డీలర్‌షిప్ స్థాయిలో క్యాష్ డిస్కౌంట్లతో సహా అనేక ఇతర బెనిఫిట్స్ అందిస్తున్నాయి.
ఈ రేంజ్‌లో JSW MG మోటార్ ఇండియా ప్రముఖ కారు మోడళ్లపై రూ.4 లక్షల వరకు బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. మీరు విండ్సర్, కామెట్ ZS EV వంటి ఎలక్ట్రిక్ కార్లను తగ్గింపు ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. అలాగే హెక్టర్, ఆస్టర్ గ్లోస్టర్ లగ్జరీ SUVలపై భారీగా తగ్గింపు పొందవచ్చు. ప్రతి మోడల్‌పై ఎంత వరకు తగ్గింపు లభిస్తుందో ఇప్పుడు చూద్దాం..
ఎంజీ విండ్సర్ ఈవీపై తగ్గింపు ఎంతంటే? :
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారులో MG విండ్సర్ ఈవీపై కస్టమర్లు రూ. 50వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఎంజీ విండ్సర్ ఈవీ కారు ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.65 లక్షల నుంచి ప్రారంభమై రూ. 18.39 లక్షల వరకు ఉంటుంది.
ఎంజీ ఆస్టర్‌పై రూ. 50వేల బెనిఫిట్స్ :
ఎంజీ ఆస్టర్ అనేది భారతీయ మార్కెట్లో కాంపాక్ట్ SUV ప్రియులకు అద్భుతమైన కారు. సరసమైన ధరలో ఫీచర్లతో కొనేసుకోవచ్చు. ఈ నెలలో వినియోగదారులు ఆస్టర్ కారుపై రూ. 50వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఎంజీ ఆస్టర్ ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.65 లక్షల నుంచి ప్రారంభమై రూ. 16.24 లక్షల వరకు ఉంటుంది.
ఎంజీ హెక్టర్ ప్లస్‌పై రూ. 90వేల వరకు బెనిఫిట్స్ :
JSW MG మోటార్ ఇండియా పాపులర్ మిడ్‌సైజ్ SUV మోడల్స్, హెక్టర్, హెక్టర్ ప్లస్‌లపై కస్టమర్‌లు ప్రస్తుతం రూ. 90వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఎంజీ హెక్టర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 14 లక్షల నుంచి ప్రారంభమై రూ. 20.76 లక్షల వరకు ఉంటుంది. అయితే, హెక్టర్ ప్లస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.05 లక్షల నుంచి రూ. 22.75 లక్షల వరకు ఉంటుంది.
ఎంజీ కామెట్ ఈవీపై రూ. లక్ష వరకు తగ్గింపు :
భారత మార్కెట్లో విక్రయించే చౌకైన ఎలక్ట్రిక్ కారులో MG కామెట్ ఈవీ ఒకటి. ఈ నెలలో కస్టమర్లు రూ. లక్ష వరకు బెనిఫిట్ పొందవచ్చు. రూ. లక్ష లోపు చిన్న ఈవీ కోసం చూస్తున్న వారికి ఎంజీ కామెట్ బెస్ట్ ఆప్షన్. ఎంజీ కామెట్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.50 లక్షల నుంచి రూ.9.56 లక్షల వరకు ఉంటుంది.
ఎంజీ ZS ఈవీపై రూ. 1.25 లక్షల వరకు బెనిఫిట్స్ :
భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV విభాగంలో ఎంజీ జెడ్ఎస్ ఈవీ అద్భుతమైన ఆప్షన్. ఈ నెలలో ఈ ఎలక్ట్రిక్ కారుపై వినియోగదారులు రూ. 1.25 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఎంజీ ZS ఈవీ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 17.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 20.50 లక్షల వరకు ఉంటాయి.
MG గ్లోస్టర్ అత్యధిక బెనిఫిట్స్ :
ఇయర్ ఎండ్ ఆఫర్‌లో భాగంగా ఈ నెలలో ఎంజీ మోటార్ ఫుల్ సైజ్ SUV, గ్లోస్టర్‌పై రూ. 4 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. భారత మార్కెట్లో ఎంజీ గ్లోస్టర్ టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కోడియాక్‌తో సహా ఇతర పెద్ద SUVలతో పోటీపడుతుంది. ఎంజీ గ్లోస్టర్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 38.33 లక్షల నుంచి ప్రారంభమై రూ. 43.16 లక్షల వరకు ఉంటాయి.
