పెండింగ్‌లో జియో-ఫేస్‌బుక్ ఒప్పందం.. డేటా దుర్వినియోగం అనుమానాలు

జియో ద్వారా వరుసగా భారీ పెట్టుబడులను స్వీకరిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కష్టం ఎదురైంది. జియో ఫ్లాట్ ఫామ్స్‌లో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ పెట్టుబడులకు కుదుర్చుకున్న ఒప్పందంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దృష్టి సారించింది.
రిలయన్స్ జియోలో ఫేస్‌బుక్ 9.99% వాటాను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) పరిశీలిస్తుంది. వినియోగదారుల వ్యక్తిగత డేటా గురించి సిసిఐ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే సిసిఐ చైర్మన్ అశోక్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. డేటా దుర్వినియోగం గురించి మేము ఆందోళన చెందుతున్నట్లు వివరించారు. అయితే, దీని గురించి మరిన్ని వివరాలు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు.
ప్రపంచంలోకెల్లా అత్యంత వేగంగా ఇంటర్నెట్ విస్తరిస్తున్న భారతదేశానికి చెందిన డేటా దుర్వినియోగం అవుతుందన్న ఆరోపణలపై సీసీఐ ద్రుష్టిని కేంద్రీకరించిందని, ప్రస్తుతం జియో-ఫేస్‌బుక్ ఒప్పందాన్ని పెండింగ్‌లో ఉంచుతున్నట్లు వెల్లడించారు.
ఇలాంటి పొత్తులలో కొత్త భాగస్వామి అంచనాకు వస్తారా అనే దానిపై సిసిఐ పరిశీలిస్తోందని గుప్తా చెప్పారు. ఈ పొత్తులో కొత్త భాగస్వామితో ముప్పు ఉందా? అనే విషయాన్ని గమనిస్తున్నట్లు సీసీఐ చెబుతుంది. జియో మరియు ఫేస్‌బుక్‌ల ఒప్పందంతో సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ చాలా డేటాను యాక్సెస్ చేస్తుంది. ఈ కారణంగా, ప్రజల వ్యక్తిగత సమాచారం తప్పు మార్గంలో ఉపయోగించట్లేదని నిర్ధారించబడాలి.
అయితే, ఈ విషయంలో తుది తీర్పు కోసం సిసిఐ ఎటువంటి కాలపరిమితిని పేర్కొనలేదు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, 210 రోజుల్లో ఈ విషయంలో సిసిఐ నిర్ణయం తీసుకోకపోతే, ఈ ఒప్పందం ఆమోదయోగ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఒప్పందంలో ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించలేదని ఫేస్‌బుక్ సిసిఐకి ఇచ్చిన దరఖాస్తులో పేర్కొంది. ఫేస్‌బుక్ మరియు దాని అనుబంధ సంస్థ వాట్సాప్ ఈ పెట్టుబడి ద్వారా డిజిటల్ మార్కెట్‌ను స్థాపించే ప్రణాళికతో పనిచేస్తున్నాయి.
Read: చైనా ఉత్పత్తులను భారత్ పూర్తిగా బహిష్కరించలేకపోవచ్చు! ఎందుకో తెలుసా?