First Apple Offline Stores : భారత్‌లో ఫస్ట్ ఆపిల్ ఆఫ్‌లైన్ స్టోర్లు.. ఈ రెండు నగరాల్లోనే.. లాంచ్ ఎప్పుడంటే?

First Apple Offline Stores : ఆపిల్ (Apple) భారత మార్కెట్లో మొదటి రిటైల్ స్టోర్ (First Retail Store) ఏప్రిల్ 18న లాంచ్ కానుందని వెల్లడించింది. మొదటి (Apple BKC) స్టోర్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ డ్రైవ్ (Jio World Drive) మాల్‌లో ప్రారంభించనుంది.

First Apple offline stores in Delhi and Mumbai will open on these dates

First Apple Offline Stores : ఆపిల్ (Apple) భారత మార్కెట్లో మొదటి రిటైల్ స్టోర్ (First Retail Store) ఏప్రిల్ 18న లాంచ్ కానుందని వెల్లడించింది. మొదటి (Apple BKC) స్టోర్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ డ్రైవ్ (Jio World Drive) మాల్‌లో ప్రారంభించనుంది. ఆపిల్ రెండో స్టోర్ ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్‌లో (Saket) ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. ఈ ఆపిల్ స్టోర్ల ప్రారంభోత్సవం ఏప్రిల్ 20న జరుగనుంది.

ఆపిల్ కొత్త రిటైల్ సెంటర్లు భారత మార్కెట్లో మరింత విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. ఆపిల్ యూజర్ల కోసం బెస్ట్ సర్వీసులను అందించేందుకు కంపెనీ తమ ప్రొడక్టులను కొనుగోలు చేసేందుకు కొత్త మార్గాలను అందిస్తుంది. ఆపిల్ BKC ఏప్రిల్ 18, మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. అదేవిధంగా (Apple Saket) యూజర్ల కోసం ఏప్రిల్ 20న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది.

ఈ లాంచ్ ఈవెంట్‌కు కంపెనీ సీఈవో టిమ్ కుక్ (Tim Cook) హాజరవుతారా లేదా అనే దానిపై యాపిల్ క్లారిటీ ఇవ్వలేదు. ముంబైలోని స్టోర్ 22వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని ఇటీవల నివేదిక పేర్కొంది. ఢిల్లీలోని స్టోర్ 10వేల చదరపు అడుగుల వద్ద చాలా తక్కువగా ఉంటుంది. ఇతర బ్రాండ్‌లు తమ మొదటి రిటైల్ స్టోర్ దగ్గర షాపులను ఓపెన్ చేయకుండా ఉండేలా చర్యలు చేపట్టింది.

Read Also :  OnePlus Nord CE 3 Lite 5G : వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతంటే?

అందులో భాగంగానే సమీపంలో అన్ని చోట్ల అడ్వర్టైజింగ్ మెటీరియల్‌లను కలిగి ఉండేలా (Apple Jio Mall)తో ప్రత్యేక లీజుపై సంతకం చేసింది. Dell, HP, గూగుల్ (Google), మైక్రోసాఫ్ట్ (Microsoft), ట్విట్టర్ (Twitter), (Toshiba), IBM, ఇంటెల్, లెనోవా వంటి కొన్ని పోటీ బ్రాండ్‌లు అడ్వర్టైజింగ్ మెటీరియల్‌ని అందించడం లేదు.

First Apple offline stores in Delhi and Mumbai will open on these dates

ఢిల్లీ, ముంబైలలో కొత్త ఆపిల్ స్టోర్లతో భారత్‌లో కార్యకలాపాలను విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. గత 6 ఏళ్లుగా స్థిరమైన వృద్ధిని సాధించింది. పరిశోధనా సంస్థ IDC ఫిబ్రవరి నివేదిక ప్రకారం.. ఆపిల్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో (రూ. 41వేల అంతకన్నా ఎక్కువ) షేరుకు 60తో ఆధిపత్యం చెలాయించింది. గత ఏడాదిలో ఐఫోన్ 13 దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది.

ఆపిల్ కూడా నెమ్మదిగా ప్రొడక్టులను భారత్ సహా ఇతర దేశాలకు మారుస్తోంది. ఇప్పటికే ఐఫోన్ 14ను భారత్‌లోనే తయారు చేసింది. ముంబై, ఢిల్లీలో రిటైల్ అవుట్‌లెట్లను ప్రారంభించిన తర్వాత భారత మార్కెట్లో మరిన్ని స్టోర్లను ఓపెన్ చేయాలని యోచిస్తున్నట్లు ఆపిల్ ప్రకటించలేదు. అయినప్పటికీ, (iMagine) స్టోర్‌ల వంటి భాగస్వామి రిటైలర్ల నుంచి ఆపిల్ ప్రొడక్టులను కొనుగోలు చేసే అవకాశం కస్టమర్‌లకు అందుబాటులో ఉంది.

ఆఫ్‌లైన్ షాపులతో, కస్టమర్‌లు కొన్ని స్పెషల్ ఆఫర్‌లు, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ యాక్సెస్‌ను కలిగి ఉండవచ్చు. ఆపిల్ స్టోర్ ప్రతినిధులను ఆపిల్ జీనియస్ అంటారు. ప్రస్తుతం, కంపెనీ 25 దేశాలలో 500కి పైగా రిటైల్ స్టోర్‌లను కలిగి ఉంది. రిటైల్ స్టోర్‌లలో Apple ‘టుడే ఎట్ యాపిల్’ ప్రోగ్రామ్‌ను కూడా నిర్వహిస్తుంది. ఆపిల్ తమ ప్రొడక్టుల డెమోలను యూజర్లకు అందించేందుకు క్రియేటర్లను అనుమతినిస్తుంది. భారత్‌లో కంపెనీ మొదటి ఆఫ్‌లైన్ ‘Today at Apple’ అనే కార్యక్రమాన్ని ఫిబ్రవరిలో ఢిల్లీలో నిర్వహించింది.

Read Also : Public Chargers in Malls : షాపింగ్ మాల్స్, మార్కెట్లలో పబ్లిక్ ఛార్జర్లను అసలే వాడొద్దు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!