Fixed Deposit : మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా? బ్యాంక్ FDలపై తగ్గనున్న వడ్డీ రేట్లు.. కస్టమర్లు ఏం చేయాలంటే?

Fixed Deposit : బ్యాంకులు FD వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తాయా? అంతకంటే ఎక్కువా లేదా తక్కువకు తగ్గిస్తాయా? అనేది ఇంకా తెలియదు.

Fixed Deposit

Fixed Deposit : ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను (Fixed Deposit) తగ్గించనున్నాయి. ఆర్బీఐ రెపో రేటులో 50 బేసిస్ పాయింట్ల తగ్గింపును ప్రకటించింది.

ఆర్బీఐ నిర్ణయంతో గృహ రుణ యూజర్లకు రిలీఫ్ అయినప్పటికీ, కొత్త, పాత గృహ రుణ కస్టమర్లకు రెపో రేటు తగ్గింపుతో ప్రయోజనం పొందవచ్చు. కానీ, బ్యాంకుల స్థిర డిపాజిట్లు చేసే వారికి తక్కువ వడ్డీ లభించనుంది. ఇకపై ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లు ఏం చేయాలి అనేది ప్రశ్న తలెత్తుతోంది.

Read Also : Loans EMI : ఆర్బీఐ బిగ్ సర్‌ప్రైజ్.. ఊహించని విధంగా రెపో రేట్ కట్.. భారీగా తగ్గనున్న ఈఎంఐలు..!

ఏడాదిలో 1 శాతం తగ్గిన రెపో రేటు :
ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించిన తర్వాత బ్యాంకులు గృహ, కారు రుణాలు, వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను కూడా తగ్గిస్తాయి . ఈ ఏడాదిలో ఫిబ్రవరిలో, ఆర్‌బీఐ మొదటిసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

రెండవసారి ఏప్రిల్‌లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇప్పుడు మూడవసారి రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 50 బేసిస్ పాయింట్లు తగ్గింపుతో బ్యాంకులు గృహ రుణాలు, కారు రుణాల వడ్డీ రేట్లను త్వరలో తగ్గించాల్సి ఉంటుంది.

FDలపై వడ్డీని బ్యాంకులు ఎందుకు తగ్గిస్తాయి? :
బ్యాంకులు రుణాలపై (Fixed Deposit) ఎక్కువ సంపాదిస్తాయి. గృహ, కారు రుణాలు ఇచ్చే వడ్డీ రేట్లు ఎంత ఎక్కువగా ఉంటే బ్యాంకులకు అంత ఆదాయం. కానీ, ఆర్బీఐ రెపో రేటును తగ్గించిన తర్వాత గృహ రుణాలు, కారు రుణాలు, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లను తప్పక తగ్గించాల్సి ఉంటుంది.

బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా తగ్గిస్తాయి. ఈ ఏడాదిలో రెండుసార్లు రెపో రేటు తగ్గిన తర్వాత, చాలా బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి.

రాబోయే రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, బ్యాంకులు FD వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తాయో లేదో ఇంకా తెలియదు.

ఎక్కువ లేదా తక్కువ కూడా ఉండొచ్చు. బ్యాంకులు నిధుల అవసరాన్ని బట్టి ఈ నిర్ణయం తీసుకుంటాయి. ఎక్కువ నిధులు అవసరమయ్యే బ్యాంకు వడ్డీ రేటును తక్కువ తగ్గించవచ్చు. తక్కువ నిధులు అవసరమయ్యే బ్యాంకు వడ్డీ రేటును ఎక్కువ తగ్గించవచ్చు.

FD కస్టమర్లు (Fixed Deposit) ఆందోళనక్కర్లేదు :
మీరు ఇప్పటికే బ్యాంకులో FD చేసి ఉంటే.. మెచ్యూరిటీ వరకు ఆందోళన అవసరం లేదు. మీరు బ్యాంకులో FD చేసిన వడ్డీ రేటు FD మెచ్యూరిటీ చెందే వరకు అందుబాటులో ఉంటుంది. FDపై మెచ్యూరిటీ పొందితే FD అకౌంట్ రెన్యువల్ చేయమని బ్యాంక్ మిమ్మల్ని అడగవచ్చు. కానీ, బ్యాంక్ గతంలో కన్నా తక్కువ వడ్డీ రేటును అందిస్తుంది.

అప్పుడు మీరు ఆ FDని రెన్యువల్ చేయకపోవడమే మంచిది. మీ FD నుంచి డబ్బును విత్ డ్రా చేసుకోవాలి. ఇతర బ్యాంకుల వడ్డీ రేట్లను చెక్ చేయవచ్చు. FDపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్న అనేక బ్యాంకులు ఇప్పటికీ ఉన్నాయి. మీరు ఆ బ్యాంకులలో కొత్త FD అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.

కొత్త FD అకౌంట్ ఓపెన్ చేస్తారా? :
మీరు కొత్త FD ఓపెన్ చేయాలని అనుకుంటున్నారా? వెంటనే తొందరపడండి. రెపో రేటు తగ్గింపు తర్వాత బ్యాంకులు FDపై వడ్డీ రేటును తగ్గించేందుకు కొంత సమయం పట్టవచ్చు. బ్యాంకులు FDపై వడ్డీని తగ్గించే ముందు ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందించే బ్యాంకులో FD చేయడం బెటర్.

Read Also : Home Loans : హోం లోన్ కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. కేవలం 5 నెలల్లో మూడోసారి ఈఎంఐ తగ్గుతుందోచ్..!

ప్రస్తుతం, లాంగ్ టైమ్ FDపై 7.5 నుంచి 8 శాతం వడ్డీ రేటును అందిస్తున్న అనేక బ్యాంకులు ఉన్నాయి. రాబోయే నెలల్లో రెపో రేటు తగ్గింపు ప్రక్రియ కొనసాగనుంది. కనీసం 1.5 నుంచి 2 ఏళ్ల FD చేయడం మంచిదని గుర్తుంచుకోవాలి. రెపో రేటు తగ్గినప్పుడల్లా, బ్యాంక్ FDపై వడ్డీ రేటును తగ్గిస్తుంది.