Realme P4 5G Sale : రియల్‌మి ఆఫర్ అదుర్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15వేల లోపు ధరకే కొనేసుకోండి.. సెల్ఫీ కెమెరా మాత్రం కేక..!
Realme P4 5G Sale : రియల్‌మి కొత్త 5జీ ఫోన్ రూ. 15వేల లోపు ధరకే కొనేసుకోవచ్చు. 16ఎంపీ సెల్ఫీ కెమెరా అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ డీల్ ఎలా పొందాలో చూద్దాం..

Flipkart Big Bang Diwali Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో రియల్‌మి P4 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. రూ. 15వేల లోపు ధరలో 5G ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ల ద్వారా డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు. రూ. 15వేల లోపు ధరలో భారీ బ్యాటరీతో కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ ఆఫర్‌ను అసలు వదులుకోవద్దు.

భారీ 7000mAh బ్యాటరీ, అద్భుతమైన కెమెరా, పవర్‌ఫుల్ మీడియాటెక్ ప్రాసెసర్‌తో రియల్‌మి స్మార్ట్‌ఫోన్ వాస్తవానికి రూ. 15వేల కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో డ్యూయల్-వ్యూ వీడియో రికార్డింగ్ ఫీచర్, అనేక అద్భుతమైన ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌ను ఓసారి పరిశీలిద్దాం.

రియల్‌మి P4 5జీ డిస్కౌంట్ ఆఫర్ : రియల్‌మి P4 5జీ సిరీస్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. దీపావళి సేల్స్ సందర్భంగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి P4 5G అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఒకప్పుడు రూ. 20,999 ధరకు ఉన్న ఈ ఫోన్ ఇప్పుడు రూ. 15,999 మాత్రమే. ధరను మరింత తగ్గాలంటే కంపెనీ ఈ ఫోన్‌పై ప్రత్యేకమైన బ్యాంక్ డీల్‌లను కూడా అందిస్తోంది.

బ్యాంకుల నుంచి యూపీఐ లేదా క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లించే కస్టమర్లకు కంపెనీ రూ. 1,000 తగ్గింపు అందిస్తోంది. ఫలితంగా, రియల్‌మి ఫోన్ ఇప్పుడు రూ. 15వేల కన్నా తక్కువ (రూ. 14,999) ధరకు అందుబాటులో ఉంది. పాత ఫోన్‌పై రూ. 14,500 వరకు తగ్గింపు పొందవచ్చు. మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా తగ్గింపు పొందవచ్చు.

రియల్‌మి P4 5G స్పెషల్ ఫీచర్లు : ఈ ఫోన్ భారీ 6.77-అంగుళాల స్క్రీన్‌తో సన్నగా తేలికగా ఉంటుంది. ఈ గాడ్జెట్ 144Hz అమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంది. గరిష్ట ప్రకాశం 4500 నిట్స్. ఈ ఫోన్‌లో డ్యూయల్ చిప్‌సెట్ కూడా ఉంది. మీడియాటెక్ 7400 ప్రాసెసర్ పవర్ అందిస్తుంది.

50MP ప్రైమరీ కెమెరా, 8MP సెకండరీ కెమెరాతో ఈ ఫోన్ స్ట్రాంగ్ కెమెరా సెటప్ కలిగి ఉంది. సెల్ఫీల కోసం ఈ రియల్‌మి 16MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే భారీ 7000mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌లో అనేక అదనపు ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి.