×
Ad

Flipkart iPhone 16 Orders : ఐఫోన్ కొనేవారికి బిగ్ షాకింగ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో రద్దు అవుతున్న ఆపిల్ ఐఫోన్ 16 ఆర్డర్లు.. ఇదో పెద్ద స్కామ్ అంటున్న కొనుగోలుదారులు..!

Flipkart iPhone 16 Orders : ఫ్లిప్‌కార్ట్‌లో మీరు ఆపిల్ ఐఫోన్ కోసం ఆర్డర్ చేస్తున్నారా? అయితే, ఒక్క క్షణం ఆగండి.. ఎందుకంటే ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రోపై ఆర్డర్లు క్యాన్సిల్ అవుతున్నాయట.. చాలా మంది కస్టమర్లు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు.

Flipkart iPhone 16 Orders

Flipkart iPhone 16 Orders : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్ ముందస్తు సేల్ మొదలుకాగానే చాలామంది కొనుగోలుదారులు ఆపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో కోసం ఆర్డర్ చేశారు. ఐఫోన్లపై క్రేజీ డిస్కౌంట్లతో అనేక మంది కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే చాలా మందిని ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో డీల్స్ ఆకర్షించాయి. ఈ రెండు (Flipkart iPhone 16 Orders) ఐఫోన్లు భారీ డిస్కౌంట్ ధరకు లభించడంతో ఐఫోన్ ఆర్డర్ల సంఖ్య పెరిగిపోయింది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఊహించని విధంగా ఐఫోన్ ఆర్డర్లు క్యాన్సిల్ అయిపోతున్నాయి. దాంతో కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ నుంచి తమ ఆర్డర్‌లు రద్దు అవుతున్నాయంటూ ఫిర్యాదు చేస్తున్నారు.

ఐఫోన్ కొనేవారికి నిజంగా షాకే :
ఐఫోన్ కొనుగోలు చేసేవారికి ఇది నిజంగా పెద్ద షాకింగ్ న్యూసే.. ఎందుకంటే ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఏదైనా వస్తువు కొనుగోలు చేసే కస్టమర్లు అంతా నిజమేనని నమ్మి ఆర్డర్ చేస్తుంటారు. అయితే, ఇప్పుడు ఉన్నట్టు ఉండి ఐఫోన్ ఆర్డర్లు రద్దు కావడంతో కొనుగోలుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉందా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Realme GT 7 Pro Price : కొత్త ఫోన్ కొంటున్నారా? రియల్‌మి GT 7 ప్రోపై బిగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే? ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

మరొకొందరు యూజర్లు మాత్రం గతంలో ప్రకటించిన ధరల తగ్గింపునకు సంబంధించి ప్లాట్‌ఫామ్‌పై ఎంగేజ్ మెంట్ పెంచేందుకే ఫ్లిప్ కార్ట్ ఇలా చేస్తుందని తిట్టిపోస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ పోటీదారు అయిన అమెజాన్ కూడా ఇదే తరహా ఐఫోన్లపై సేల్స్ ఆఫర్ అందిస్తోంది. మరెన్నో అద్భుతమైన డీల్‌లతో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్ అందుబాటులో ఉంది.

Flipkart iPhone 16 Pro

ఐఫోన్లపై అసలు ఆఫర్ ఏంటి? :

ఫ్లిప్‌కార్ట్ ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఐఫోన్ 16 ధర రూ.51,999కి లభిస్తుంది. అలాగే 128GB స్టోరేజ్‌తో ఐఫోన్ 16 ప్రో రూ.69,999కి లభిస్తుంది. ఈ రెండు ఐఫోన్లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉండటంతో ఐఫోన్ ప్రియులు ఆర్డర్లు పెట్టేసుకున్నారు.

కొనుగోలుదారులు ఏమంటున్నారంటే? :
ఫ్లిప్‌కార్ట్ ముందస్తు డీల్స్ మొదలైన వెంటనే చాలా మంది ఐఫోన్‌ల కోసం ఆర్డర్లు చేశారు. అయితే, ఈ ఆర్డరు అకస్మాత్తుగా క్యాన్సిల్ కావడం కొనుగోలుదారులందరిని షాక్‌కు గురిచేసింది. కొంతమంది కొనుగోలుదారులు ఎక్స్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఒక ఎక్స్ యూజర్ తాను రాత్రిపూట ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో రెండింటినీ ఆర్డర్ చేశానని, ఉదయం చెక్ చేసినప్పుడు తన రెండు ఆర్డర్‌లు ఎలాంటి కారణం లేకుండా రద్దు అయ్యాయని వాపోయాడు.

iPhone 16 Pro

మరో యూజర్ తాను పూర్తిగా చెల్లించిన మూడు ఆర్డర్‌లను కేవలం 4 గంటల్లోనే రద్దు చేశారని, దీని కారణంగా బిగ్ బిలియన్ డేస్ ఒక స్కామ్‌లా కనిపిస్తోందని అన్నారు. కొంతమంది యూజర్లు తమ ఐఫోన్ షిప్ అయిందని ఫిర్యాదు చేశారు. కానీ, ఇప్పుడు డెలివరీకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ చూపించడం లేదని వాపోయారు. ఇప్పటివరకు, ఫ్లిప్‌కార్ట్ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆర్డర్‌లలో వాస్తవానికి ఏం జరుగుతుందో తెలియాలంటే ఫ్లిప్‌కార్ట్ స్పందించవరకు వేచి ఉండాల్సిందే..