Realme GT 7 Pro Price : కొత్త ఫోన్ కొంటున్నారా? రియల్‌మి GT 7 ప్రోపై బిగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే? ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Realme GT 7 Pro Price : రియల్‌మి GT 7 ప్రో ధర తగ్గిందోచ్.. అమెజాన్ సేల్ సందర్భంగా భారీ ధర తగ్గింపు పొందింది. ఈ స్మార్ట్‌ఫోన్, రూ.10వేలు ఫ్లాట్ ధర డిస్కౌంట్ అందిస్తోంది.

Realme GT 7 Pro Price : కొత్త ఫోన్ కొంటున్నారా? రియల్‌మి GT 7 ప్రోపై బిగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే? ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Realme GT 7 Pro Price

Updated On : September 23, 2025 / 5:59 PM IST

Realme GT 7 Pro Price : మీరు గేమింగ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా రియల్‌మి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ అతి తక్కువ ధరకే పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 6,500 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలతో కూడిన భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ రియల్‌మి GT 7 ప్రో డీల్‌ను ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

అమెజాన్‌లో రియల్‌మి GT 7 ప్రో డీల్ :
ప్రస్తుతం అమెజాన్‌లో రియల్‌మి GT 7 ప్రో రూ.49,999 ధరకు అందుబాటులో ఉంది. ధర రూ.10వేలు (Realme GT 7 Pro Price) ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. మీరు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై ఇన్‌స్టంట్ రూ.1,250 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డీల్‌ ద్వారా పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా అమెజాన్ రూ.44,200 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఫైనల్ ఎక్స్చేంజ్ వాల్యూ మోడల్, డివైజ్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

Read Also : Best Camera Phones : 2025లో బెస్ట్ కెమెరా ఫోన్లు.. కొత్త ఆపిల్ ఐఫోన్ ఎయిర్ కన్నా 6 బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. ఏది కొంటారో మీఇష్టం..!

రియల్‌మి GT 7 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
రియల్‌మి GT 7 ప్రోలో HDR 10+ సపోర్ట్‌తో 6.78-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లే ప్యానెల్, 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. భారత మార్కెట్లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి GT 7 ప్రో అని చెప్పొచ్చు.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌లో ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఇంకా, రియల్‌మి GT 7 ప్రో 5800mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. 120W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.