Best Camera Phones : 2025లో బెస్ట్ కెమెరా ఫోన్లు.. కొత్త ఆపిల్ ఐఫోన్ ఎయిర్ కన్నా 6 బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. ఏది కొంటారో మీఇష్టం..!

Best Camera Phones : 2025లో ఆపిల్ ఐఫోన్ ఎయిర్ కన్నా బెటర్ ఫీచర్లతో ఆరు అద్భుతమైన కెమెరా ఫోన్లు ఉన్నాయి.. ఇందులో ఏ ఫోన్ కొంటారో కొనేసుకోవచ్చు.

1/9Best Camera Phones
Best Camera Phones : 2025లో కొత్త ఐఫోన్ ఎయిర్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. ఆపిల్ ఐఫోన్ కన్నా అదిరిపోయే ఫీచర్లతో అనేక ఆండ్రాయిడ్ ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇప్పుడు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లలో అద్భుతమైన కెమెరా-సెంట్రలైజడ్ ఫోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
2/9iPhone Air In 2025
శాంసంగ్ భారీ 200MP సెన్సార్ నుంచి షావోమీ లైకా ఆప్టిక్స్, ఒప్పో డ్యూయల్ పెరిస్కోప్ జూమ్ వరకు అనేక ప్రొఫెషనల్-గ్రేడ్ ఫోటోగ్రఫీని అందించే ఫోన్లలో 6 టాప్ కెమెరా ఫోన్‌లను మీకోసం అందిస్తున్నాం.
3/9iPhone Air
ఇందులో గూగుల్ పిక్సెల్ 10ప్రో, శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, ఐఫోన్ 16 ప్రో, ఒప్పో ఫైండ్ X8 ప్రో, వివో X200 ప్రో, షావోమీ 15 అల్ట్రా ఫోన్లు ఉన్నాయి. మీకు నచ్చిన కెమెరా ఫోన్ ఏదైనా కొనేసుకోండి.
4/9Google Pixel 10 Pro XL
గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL (రూ. 1,24,999) : గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL ఫోన్ 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ లెన్స్, ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. 48MP 5x టెలిఫోటో షూటర్ ఉన్నాయి. 42MP ఫ్రంట్ కెమెరా అద్భుతమైన సెల్ఫీలను అందిస్తుంది. 2025లో ఐఫోన్ ఎయిర్ కన్నా పిక్సెల్ 10 ప్రో XL ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్‌గా నిలిచింది.
5/9Samsung Galaxy S25 Ultra
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా (రూ. 1,11,900) : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో 200MP ప్రైమరీ కెమెరా, 5x జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో, 3x జూమ్‌తో 10MP టెలిఫోటో, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. 8K వీడియో, HDR10+, ప్రో-లెవల్ స్టెబిలైజేషన్‌తో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ప్రత్యేకించి ఫొటోగ్రఫీ ప్రియులకు ఐఫోన్ ఎయిర్ కన్నా ఈ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ బెటర్ ఆప్షన్.
6/9iPhone 16 Pro
ఐఫోన్ 16 ప్రో (రూ. 1,05,999) : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో ఫోన్ 48MP మెయిన్ కెమెరా, 12MP పెరిస్కోప్ టెలిఫోటో, 48MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో వస్తుంది. డాల్బీ విజన్ వీడియో, అత్యుత్తమ ఇమేజ్ క్వాలిటీతో అద్భుతమైన వాల్యూను అందిస్తుంది.ఈ ఆపిల్ ఫోన్ ఖరీదైన ఐఫోన్ ఎయిర్‌ కన్నా తగ్గింపు ధరకే కొనేసుకోవచ్చు.
7/9Oppo Find X8 Pro
ఒప్పో ఫైండ్ X8 ప్రో (రూ. 99,999) : ఈ ఒప్పో ఫైండ్ X8 ప్రో ఫోన్ మొత్తం నాలుగు 50MP సెన్సార్లు, 6x వరకు డ్యూయల్ పెరిస్కోప్ జూమ్‌తో వస్తుంది. ఒప్పో ఫైండ్ X8 ప్రో ప్రొఫెషనల్-గ్రేడ్ మొబైల్ ఫొటోగ్రఫీ కోసం రూపొందించారు. హాసెల్‌బ్లాడ్ ట్యూనింగ్‌తో కూడిన ఈ ప్రీమియం ఫోన్ ఐఫోన్ ఎయిర్‌కి బదులుగా టాప్-ఎండ్ కెమెరా ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి సరైన ఫోన్.
8/9Vivo X200 Pro
వివో X200 ప్రో (రూ. 94,999) : ఈ వివో X200 ప్రో ఫోన్ 200MP పెరిస్కోప్ టెలిఫోటో 50MP అల్ట్రావైడ్ లెన్స్, జైస్-మెరుగైన ఆప్టిక్స్‌తో వస్తుంది. వివో X200 ప్రో ఫొటోగ్రఫీకి అద్భుతంగా ఉంటుంది. అడ్వాన్స్ కెమెరా సిస్టమ్ ఐఫోన్ ఎయిర్‌కు గట్టిపోటీగా నిలుస్తుంది. ఫ్లాగ్‌షిప్-లెవల్ ఫొటో, వీడియో పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
9/9Xiaomi 15 Ultra
షావోమీ 15 అల్ట్రా (రూ. 1,09,999) : షావోమీ 15 అల్ట్రా ఫోన్ 50MP వైడ్ సెన్సార్‌, ఒక-అంగుళాల భారీ సైజుతో అందిస్తుంది. 4.3x ఆప్టికల్ జూమ్‌ కలిగి ఉంది. 200MP పెరిస్కోప్ టెలిఫోటోతో వస్తుంది. లైకా-ట్యూన్డ్ ఆప్టిక్స్, 8K వీడియో, 120fps వద్ద 4K, 32MP 4K సెల్ఫీ షూటర్ ఆపిల్ ఐఫోన్ ఎయిర్ కన్నా అద్భుతమైన ఆప్షన్.