Samsung Galaxy S24 Plus : ఫోన్ భలే ఉంది భయ్యా.. రూ. లక్ష ఖరీదైన శాంసంగ్ ఫోన్ కేవలం రూ. 53వేలు మాత్రమే.. ఇప్పుడే కొనేసుకోండి!

Samsung Galaxy S24 Plus : శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ ధర భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా సొంతం చేసుకోవాలో చూద్దాం..

Samsung Galaxy S24 Plus

Samsung Galaxy S24 Plus : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసం అద్భుతమైన డీల్ ఒకటి ఉంది. ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ 5G ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ లాంచ్ అయి కొద్దిరోజులకే భారీ తగ్గింపు ధరకే లభ్యమవుతోంది.

Read Also : Redmi A5 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి A5 సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు భలే ఉన్నాయి.. మనసుకు నచ్చితే కొనేవరకు అసలు ఉండలేరు..!

ప్రస్తుతం మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ ఎక్కువగా కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ శాంసంగ్ ఫోన్ సెల్ఫీ కెమెరా కూడా చాలా అద్భుతంగా ఉంది. శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ అసలు ధర రూ. లక్ష రూపాయిలు ఉండగా, ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా ఇప్పుడు మీరు సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది. ఇంకా ఏయే ఆఫర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ 5G ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ 5G ధర, ఆఫర్ల విషయానికి వస్తే.. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ అసలు ధర రూ. 99,999కు కొనుగోలు చేయొచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ నుంచి 47 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపు తర్వాత శాంసంగ్ ఫోన్ ధర రూ. 52999గానే ఉంటుంది.

ఆఫర్ల విషయానికి వస్తే.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై బ్యాంక్ ఆఫర్ ద్వారా 5శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. అలాగే, మీకు IDFC బ్యాంక్ కార్డ్‌పై రూ. 750 తగ్గింపు పొందవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. మీకు ఎలాంటి ఈఎంఐ ఆప్షన్ కూడా లేదు. కానీ, ఈ శాంసంగ్ ఫోన్ లిమిటెడ్ స్టాక్‌లో అందుబాటులో ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ ఈజీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ ముఖ్య ఫీచర్లు :

డిస్‌ప్లే : ఈ శాంసంగ్ ఫోన్ 6.2-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. రిఫ్రెష్ రేట్ 120Hz సపోర్టుతో వస్తుంది.

ప్రాసెసర్ : మల్టీ టాస్కింగ్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 డిస్‌ప్లే ప్రొటెక్షన్‌తో వస్తుంది.

కెమెరా ఫీచర్లు : కెమెరా విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా 50MP, సెకండరీ కెమెరా 10MP, థర్డ్ కెమెరా 12MP

Read Also : One UI 7 Update : శాంసంగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త వన్ UI 7 అప్‌డేట్ రిలీజ్.. మీరు వాడే మోడల్ ఇదేనా? గెట్ రెడీ!

సెల్ఫీ కెమెరా : ఈ హ్యాండ్‌సెట్ ఫ్రంట్ సైడ్ 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. అద్భుతమైన ఫోటోలను క్లిక్ చేయవచ్చు.

బ్యాటరీ : బ్యాటరీ బ్యాకప్ కోసం ఈ ఫోన్ 4900mAh బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.