Fired CEOs List : స్టీవ్ జాబ్స్ టు సామ్ ఆల్ట్‌మన్.. సొంత కంపెనీలే వీరిని కాదని పొమ్మన్నాయి.. వారు ఎవరంటే?

Fired CEOs List : ఓపెన్‌ఏఐ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మన్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించారు. ఆల్ట్‌మన్ మాదిరిగా గతంలో సొంత కంపెనీల నుంచి వైదొలిగిన వ్యవస్థాపకుల జాబితాలో స్టీవ్ జాబ్స్, జాక్ డోర్సే, ట్రావిస్ కలానిక్ సహా మరికొందరు ఉన్నారు. ఇంతకీ వారెవరో ఓసారి లుక్కేయండి.

From Apple's Steve Jobs to OpenAI's Sam Altman

Fired CEOs List : ప్రస్తుత రోజుల్లో ఏదైనా వ్యాపారం అత్యంత లాభదాయకంగా మారితే.. మీకోసం మీరు మాత్రమే పని చేయరు. సంస్థ కోసం కూడా పనిచేయాల్సి వస్తుంది. సొంత వ్యాపార అభివృద్ధికి ఎంతోమంది సాయం అవసరం పడుతుంది. అప్పుడు ఆ కంపెనీలో డైరెక్టర్లు, వాటాదారులు, పెట్టుబడిదారులతో కలిసి ఒక బోర్డుగా మారుతుంది. అలాంటిప్పడు ఏదైనా అనుకోని అవాంతరం ఎదురైనప్పుడు మీ సొంత కంపెనీలోనే మీ ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి రావొచ్చు.

ఇప్పుడు ఇలాంటి అనుభవమే చాట్‌జీపీటీ సృష్టికర్త సామ్ ఆల్ట్‌‌మన్‌కు ఎదురైంది. ఈయన మాత్రమే కాదు.. గతంలో ఇలాంటి వారెందరో టెక్ దిగ్గజాలు సీఈఓలుగా రాణించి చివరికి అదే కంపెనీ నుంచి ఏదో ఒక కారణంతో నిష్ర్కమించాల్సి వచ్చింది. వారిలో ఇప్పుడు ఓపెన్‌ఏఐ నుంచి సామ్ ఆల్ట్‌మన్ ఉండగా.. ఆపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్, ట్విట్టర్ నుంచి జాక్ డోర్సే, నోహ్ గ్లాస్, ఉబెర్ నుంచి ట్రావిస్ కలానిక్ వంటి మరెందరో సీఈఓలుగా సొంత కంపెనీల్లోనే ఉద్యోగాలను కోల్పోయారు.

Read Also : Elon Musk : సామ్ ఆల్ట్‌మన్‌ తొలగింపుపై మస్క్ మామ ఫైర్.. ఓపెన్ఏఐ ఏదో దాస్తోంది.. అదేంటో బయటపెట్టాలి..!

49శాతానికి చేరిన సీఈఓల సంఖ్య :
ఇటీవల ఓపెన్ ఏఐ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఓపెన్ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి నుంచి తొలగించడంతో టెక్ ప్రపంచంలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. గ్రే అండ్ క్రిస్మస్ కంపెనీ రిపోర్టు ప్రకారం.. 2022 ఏడాదితో పోల్చి చూస్తే.. 2023 ఏడాదిలో సీఈఓలుగా వైదొలిగిన వారి సంఖ్య 49 శాతానికి పెరిగింది.

వరల్డ్ స్టాటిస్టిక్స్ రివీల్ చేసిన జాబితా ప్రకారం..  
గత ఏడాదిలో 969 మంది సీఈఓలుగా వైదొలిగితే.. ఈ ఏడాదిలో మాత్రం 1,425 మంది సీఈఓలు వైదొలిగారు. వీరిపై వేటు పడటానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇలా సీఈఓలుగా సొంత కంపెనీల్లోనే రాణించి చివరికి రాజీనామా చేసిన వారి జాబితాను వరల్డ్ స్టాటిస్టిక్స్ (World Statistics) అనే సంస్థ ట్వీట్ ద్వారా రివీల్ చేసింది.

స్టీవ్ జాబ్స్ :
1985లో కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌తో ఆధిపత్య పోరు తర్వాత స్టీవ్ జాబ్స్ ఆపిల్ నుంచి వైదొలిగారు. పర్సనల్ కంప్యూటింగ్‌లో విప్లవాత్మక మార్పులు చేసిన ఆయన్ను 9ఏళ్ల తర్వాత సొంత కంపెనీనే తొలగించింది. ఆ తర్వాత మాజీ సీఈఓ స్థానంలో జాన్ స్కుల్లన్ కొత్త సీఈఓగా నియమితులయ్యారు. గతంలో పెప్సీ కంపెనీలో జాన్ సేవలందించారు.

1997లో మళ్లీ ఆపిల్ కంపెనీకి రెండోసారి సీఈఓగా స్టీవ్ జాబ్స్ నియమితులయ్యారు. అప్పటినుంచి కంపెనీ అభివృద్ధికి ఎంతోగానూ కృషి చేశారు. చివరికి 2011లో అనారోగ్య (అరుదైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌) సమస్యలతో కంపెనీ సీఈఓ పదవి నుంచి వైదొలిగారు. అనంతరం తన రైట్ హ్యాండ్ అయిన టిమ్ కుక్‌కు కంపెనీ పగ్గాలను అప్పగించారు.

జాక్ డోర్సే :
ట్విట్టర్ (X) అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది ఆ సంస్థ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే.. 2006 సంవత్సరంలో ట్విట్టర్‌ను స్థాపించగా.. 2008 సంవత్సరంలో ఆయన పనితీరు బాగోలేదనే కారణం చూపుతూ కంపెనీ సీఈఓ పదవి నుంచి తొలగించింది. అదే కంపెనీకి సీఈఓగా 2011లో మళ్లీ ఆయన చేరారు. 2021లో జాక్ డోర్సే స్థానంలో పరాగ్ అగర్వాల్ కొత్త సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు.

Read Also :  Satya Nadella : సామ్ ఆల్ట్‌మన్‌ను ఓపెన్ఏఐ వద్దు పొమ్మంది.. మైక్రోసాఫ్ట్ పిలిచి ఉద్యోగమిచ్చింది.. సత్యనాదెళ్ల ఏమన్నారంటే?

నోహ్ గ్లాస్ :
ట్విట్టర్ ప్రారంభంలో జాక్ డోర్సేతో పాటు నోహ్ గ్లాస్ కూడా వ్యవస్థాపకుడిగా ఉన్నారు. కానీ, అనివార్య కారణాల రీత్యా ఆయన కంపెనీ నుంచి కొద్దినెలలకే నిష్ర్కమించారు. ఆ తర్వాత ఓడియో అనే కంపెనీని ఆయన నెలకొల్పారు. అనంతరం ఈ కంపెనీని గూగుల్ సొంతం చేసుకుంది.

సామ్ ఆల్ట్‌మన్ :
ఏఐ టెక్నాలజీ కంపెనీ ఓపెన్ఏఐ సంస్థ చాట్‌జీపీటీని సృష్టించిన ఆయన్ను సీఈఓ బాధ్యతల నుంచి తప్పించింది. కంపెనీలో ఆల్ట్‌మన్ పనితీరు బాగోలేదని, విశ్వాసం కోల్పోయామని, బోర్డు తీసుకున్న నిర్ణయాలకు పదేపదే అడ్డుతగులుతున్నాడనే పలు కారణాలతో శామ్‌ను తొలగించింది.

OpenAI Sam Altman

అయితే, తొలగించిన ఆయన్ను మళ్లీ సీఈఓగా తీసుకోవాలని కంపెనీ ఇన్వెస్టర్లు తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చినట్టు నివేదికలు తెలిపాయి. అతిపెద్ద వాటాదారు అయిన మైక్రోసాఫ్ట్ సైతం ఇన్వెస్టర్లతో చర్చలు జరిపింది. ఇదే క్రమంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆల్ట్‌మన్‌కు ఆఫర్ ఇచ్చింది. సత్యనాదెళ్ల తన కంపెనీలో కొత్త ఏఐ బృందానికి నాయకత్వ బాధ్యతలను అప్పగించారు.

సొంత కంపెనీల్లో వైదొలిగిన మరికొందరు సీఈఓలు వీరే :
* ఉబెర్ నుంచి ట్రావిస్ కలానిక్
* గ్రూపాన్ నుంచి ఆండ్రూ మాసన్
* యాహూ నుంచి జెర్రీ యాంగ్
* జెట్‌బ్లూ నుంచి డేవిడ్ నీలేమన్
* ఎట్సీ నుంచి రాబా కాలిన్
* అమెరికన్ అప్పరల్ నుంచి డోవ్ చార్నే
* మెన్స్ వేర్‌హౌస్ నుంచి జార్జ్ జిమ్మర్
* చేసాపీక్ ఎనర్జీ నుంచి ఆబ్రే మెక్ క్లెండన్
* బ్లాక్ బెర్రీ నుంచి జిమ్ బాల్సిల్లీ, మైక్ లాజార్డిస్
* సిస్కో నుంచి శాండీ లెర్నర్
* జింగా నుంచి మార్క్ పిన్‌కస్
* టిండర్ నుంచి సీయాన్ రాడ్
* ఫ్లిప్‌కార్ట్ నుంచి సచిన్ బన్సాల్, బిన్నీ బన్సల్

Read Also : OpenAI CEO Sam Altman : చాట్‌జీపీటీ క్రియేటర్‌పైనే వేటు.. శామ్‌ ఆల్ట్‌మన్‌‌ను ఓపెన్ఏఐ ఎందుకు తొలగించింది? అసలేం జరుగుతోంది?