Top Range 5 Cars : స్విఫ్ట్ నుంచి క్రెటా, థార్ రోక్స్ వరకు.. 2024లో ఎంట్రీ ఇచ్చిన టాప్ రేంజ్ 5 కార్లు ఇవే.. ఏ మోడల్ ధర ఎంతంటే?

Top Range 5 Cars : భారత మార్కెట్లో మారుతి సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కియా ఇండియా వంటి టాప్ రేంజ్ కార్ల తయారీదారుల నుంచి 2024లో అనేక బిగ్ లాంచ్ ఈవెంట్లు జరిగాయి.

From Swift to Creta, Thar Roxx and others

Top Range 5 Cars : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లో ఆటోమొబైల్ దిగ్గజ బ్రాండ్ల నుంచి అనేక కొత్త మోడల్ కార్లు లాంచ్ అయ్యాయి. అందులో ప్రధానంగా మారుతి సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కియా ఇండియా వంటి టాప్ రేంజ్ కార్ల తయారీదారుల నుంచి 2024లో అనేక బిగ్ లాంచ్ ఈవెంట్లు జరిగాయి. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ ప్రారంభం నుంచి కొత్త జనరేషన్ స్విఫ్ట్, క్రెటా ఫేస్‌లిఫ్ట్, కర్వ్వ్, థార్ రోక్స్, సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లోకి ప్రవేశించాయి.

ఈ మోడల్‌లకు వినియోగదారుల నుంచి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే కార్ల వాల్యూమ్‌లు, బుకింగ్‌లు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. ఈ కారు మోడల్స్ కొనేందుకు వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో మార్కెట్లో ఈ టాప్ రేంజ్ మోడల్ కార్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఏయే బ్రాండ్ల కార్లకు ఎంత డిమాండ్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

న్యూ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ :
గత మేలో నాల్గవ జనరేషన్ స్విఫ్ట్‌ను మారుతి లాంచ్ చేసింది. ఈ కొత్త కారు ధర రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.59 లక్షల (ఎక్స్-షోరూమ్)తో వస్తుంది. కారు కొత్త అవతార్‌లో నెలకు సగటున 16వేల యూనిట్లకు పైగా వాల్యూమ్‌లను అందిస్తోంది. మొత్తం రూ.1,450 కోట్లతో ఈ కారును అభివృద్ధి చేశారు.

ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ప్రామాణికంగా ఉన్నాయి. 5-స్పీడ్ ఎంటీ 5-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్లతో కొత్త జెడ్-సిరీస్ 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ (82పీఎస్ 113ఎన్ఎమ్)ని ఉపయోగిస్తుంది. స్విఫ్ట్ మైలేజ్ ఎంటీ వెర్షన్‌కు 24.8kmpl, ఎఎంటీ వెర్షన్‌కు 25.75kmpl వరకు మైలేజీ అందిస్తుంది.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ :
క్రెటా ఫేస్‌లిఫ్ట్ జనవరిలో మార్కెట్లోకి ప్రవేశించింది. ఇప్పుడు నెలకు 16వేల యూనిట్లకుపైగా విక్రయిస్తోంది. మిడ్ సైజు ఎస్‌యూవీ సెగ్మెంట్ లీడర్‌గా నిలుస్తోంది. స్టాండర్డ్ వెర్షన్, నైట్ ఎడిషన్, ఎన్ లైన్‌తో సహా క్రెటా రేంజ్ ధర రూ. 11 లక్షల నుంచి రూ. 20.45 లక్షలు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది. క్రెటా రేంజ్ మూడు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5-లీటర్ ఎంపీఐ పెట్రోల్ (115పీఎస్ 144ఎన్ఎమ్), 1.5-లీటర్ కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ (160పీఎస్ 253ఎన్ఎమ్), 1.5-లీటర్ యూ2 సీఆర్డీఐ డీజిల్ ఉన్నాయి. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ ఎంటీ, ఐవీటీ, 7-స్పీడ్ డీసీటీ, 6-స్పీడ్ ఏటీ ఉన్నాయి.

టాటా కర్వ్ :
కర్వ్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV), ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ICE) అవతార్‌లలో అందుబాటులో ఉంది. మొదటిది ఆగస్టులో తరువాతి సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టింది. అందులో క్రెటా, సెల్టోస్, గ్రాండ్ విటారా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఎలివేట్, కుషాక్, టైగన్, ఆస్టర్ వంటి మోడళ్లను కలిగి ఉంది. మిడ్-సైజు ఎస్‌యూవీ విభాగంలోకి టాటా కర్వ్ ఎంట్రీ ఇచ్చింది. కర్వ్ ఈవీ ధర రూ. 17.49 లక్షల నుంచి రూ. 21.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండగా, కర్వ్ ఐసీఈ ధర రూ. 9.99 లక్షల నుంచి ధర రూ. 19 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

మహీంద్రా థార్ రోక్స్ :
మహీంద్రా ఆగస్టులో థార్ రోక్స్‌ను లాంచ్ చేసింది. బుకింగ్ ప్రారంభించిన (అక్టోబర్ 3న) రోజునే కేవలం 60 నిమిషాల్లో 176,218 బుకింగ్‌లను సంపాదించింది. థార్ రోక్స్ ధర రూ. 12.99 లక్షలతో మొదలై రూ. 22.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో 2 ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. జీ20 టీజీడీఐ ఎమ్ స్టాలియన్ పెట్రోల్ డీ22 ఎమ్‌హాక్, డీజిల్ పెట్రోల్ యూనిట్ 6-స్పీడ్ ఎంటీతో 162పీఎస్, 330ఎన్ఎమ్, 6-స్పీడ్ ఏటీతో 177పీఎస్, 380ఎన్ఎమ్ అభివృద్ధి చేస్తుంది.

డీజిల్ యూనిట్ 6-స్పీడ్ ఎంటీ, 6-స్పీడ్ ఏటీతో 152పీఎస్, 330ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది. పవర్‌ఫుల్ డీజిల్ వెర్షన్ (175పీఎస్ 370ఎన్ఎమ్) 6-స్పీడ్ ఏటీతో కూడా పొందవచ్చు. అలాగే, థార్ రోక్స్ పెట్రోల్‌లో ఆర్‌డబ్ల్యుడీ మాత్రమే ఉంది. అయితే, థార్ రోక్స్ డీజిల్‌లో ఆర్‌డబ్ల్యుడీ, 4డబ్ల్యుడీ (4ఎక్స్‌పిఎల్‌ఓఆర్) ఆప్షన్లు ఉన్నాయి.

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ :
సోనెట్ ఫేస్‌లిఫ్ట్ జనవరిలో లాంచ్ అయింది. ఈ కారు ధర రూ. 7.99 లక్షల నుంచి రూ. 15.77 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. బ్రెజ్జా, నెక్సాన్, వెన్యూ, ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ వాటి నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ.. ఆగస్టు, సెప్టెంబర్‌లో 10వేల కన్నా ఎక్కువ యూనిట్లను విక్రయించింది. సోనెట్‌లో 3 ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. స్మార్ట్‌స్ట్రీమ్ జీ1.2-లీటర్ పెట్రోల్ (83పీఎస్ 115ఎన్ఎమ్), స్మార్ట్‌స్ట్రీమ్ జీ1.0-లీటర్ టీ-జీడీఐ పెట్రోల్ (120పీఎస్ 172ఎన్ఎమ్) 1.5-లీటర్ సీఆర్‌డీఐ వీజీటీ డీజిల్ (116పీఎస్ 250ఎన్ఎమ్). ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ ఎంటీ, 6-స్పీడ్ ఎంటీ, 6-స్పీడ్ ఐఎంటీ, 7-స్పీడ్ డీసీటీ, 6-స్పీడ్ ఏటీ ఉన్నాయి.

Read Also : Infinix Hot 50 Pro Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఇన్ఫినిక్స్ హాట్ 50ప్రో వచ్చేసిందోచ్.. ఫీచర్లు, ధర వివరాలివే!