Garmin Smartwatches : వారెవ్వా.. అడ్వెంచర్ ప్రియుల కోసం అద్భుతమైన గార్మిన్ స్మార్ట్‌వాచ్‌‌లివే.. ఫీచర్లు మాత్రం హైలెట్..!

Garmin Smartwatches : కొత్త స్మార్ట్‌వాచ్ కావాలా? గార్మిన్ నుంచి గార్మిన్ ఇన్స్టింక్ట్ 3 సిరీస్ స్మార్ట్‌వాచ్‌లు లాంచ్ అయ్యాయి. జీపీఎస్, హెల్త్ ట్రాకింగ్ వంటి మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఎక్కడ ఎలా కొనుగోలు చేయాలంటే?

Garmin Smartwatches : వారెవ్వా.. అడ్వెంచర్ ప్రియుల కోసం అద్భుతమైన గార్మిన్ స్మార్ట్‌వాచ్‌‌లివే.. ఫీచర్లు మాత్రం హైలెట్..!

Garmin Smartwatches

Updated On : April 4, 2025 / 11:45 AM IST

Garmin Smartwatches : కొత్త స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త గార్మిన్ స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి. గార్మిన్ నుంచి ఇన్‌స్టింక్ట్ 3 సిరీస్ స్మార్ట్‌వాచ్‌లను అధికారికంగా విడుదల చేసింది. ఈ లైనప్‌లో అడ్వెంచర్ ప్రియుల కోసం రూపొందించిన గార్మిన్ ఇన్‌స్టింక్ట్ 3, ఇన్‌స్టింక్ట్ E మోడల్‌లు ఉన్నాయి.

ఈ స్మార్ట్‌వాచ్‌లు MIL-STD-810 మిలిటరీ-గ్రేడ్ మన్నిక, 10ATM వాటర్ రెసిస్టెన్స్, SatIQ GPS టెక్నాలజీతో వస్తాయి. అలాగే, ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ లైఫ్ కోసం సోలార్ ఛార్జింగ్ సపోర్టును కూడా అందిస్తాయి. గార్మిన్ ఇన్‌స్టింక్ట్ 3 సిరీస్ మొదటిసారిగా జనవరి 2024లో ప్రపంచ మార్కెట్లలో ఆవిష్కరించింది. ఇప్పుడు భారత మార్కెట్లో గార్మిన్ అధికారిక వెబ్‌సైట్, ఎంపిక చేసిన ప్రీమియం రిటైల్ షాపుల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Read Also : Airtel OTT Plans : ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. ఈ చీపెస్ట్ ప్లాన్లతో ఫ్రీగా OTT సబ్‌‌స్ర్కిప్షన్.. హైస్పీడ్ డేటా.. ఐపీఎల్ కూడా చూడొచ్చు!

గార్మిన్ ఇన్స్టింక్ట్ 3 సిరీస్ భారత్ ధర ఎంతంటే? :
గార్మిన్ ఇన్స్టింక్ట్ E : రూ. 35,990
గార్మిన్ ఇన్స్టింక్ట్ 3 సోలార్ (45mm) : రూ. 46,990
గార్మిన్ ఇన్స్టింక్ట్ 3 అమోల్డ్ (45mm) : రూ. 52,999
గార్మిన్ ఇన్స్టింక్ట్ 3 అమోల్డ్ (55mm) : రూ. 58,999

గార్మిన్ ఇన్స్టింక్ట్ 3 సిరీస్ ఫీచర్లు :
స్ట్రాంగ్ డిజైన్, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. ఇన్‌స్టింక్ట్ 3 సిరీస్‌లో మెటల్-రీన్‌ఫోర్స్డ్ బెజెల్‌తో ఫైబర్-రీన్‌ఫోర్స్డ్ పాలిమర్ కేసు ఉంటుంది. MIL-STD-810 మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్, 10ATM వాటర్-రెసిస్టెంట్ రేటింగ్‌ను కలిగి ఉంది. అత్యవసర పరిస్థితులకు సరైనదిగా చెప్పవచ్చు.

డిస్‌ప్లే వేరియంట్లు :
అమోల్డ్, MIP ప్యానెల్స్, ఇన్‌స్టింక్ట్ 3 అమోల్డ్ 390×390 పిక్సెల్స్ రిజల్యూషన్, ఆల్వేస్-ఆన్ సపోర్ట్‌తో 1.2-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇన్‌స్టింక్ట్ 3 సోలార్ & ఇన్‌స్టింక్ట్ E, MIP (మెమరీ ఇన్ పిక్సెల్) డిస్‌ప్లేలతో వస్తాయి. ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ లైఫ్ అందిస్తాయి.

అడ్వాన్స్‌డ్ GPS, నావిగేషన్ ఫీచర్లు :
గార్మిన్ ఈ స్మార్ట్‌వాచ్‌లను మల్టీ-బ్యాండ్ GPS, SatIQ టెక్నాలజీతో అమర్చింది. బ్యాటరీ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేస్తూ లొకేషన్ కచ్చితత్వాన్ని తెలియజేస్తుంది. ABC సెన్సార్లు (ఆల్టిమీటర్, బారోమీటర్, కంపాస్), ట్రాక్‌బ్యాక్ రూటింగ్ భూభాగాలను ఈజీగా నావిగేట్ చేసేందుకు సాయపడతాయి.

హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ :

  • గార్మిన్ ఇన్స్టింక్ట్ 3 సిరీస్ అనేక రకాల ఆరోగ్య, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్లతో వస్తుంది.
  • హార్ట్ రేట్ మానిటరింగ్, HRV స్టేటస్
  • బ్లడ్ ఆక్సిజన్ ట్రాకింగ్ కోసం పల్స్ ఆక్స్ సెన్సార్
  • స్లీప్ ఇన్‌సైట్స్, స్ట్రెస్ మానిటరింగ్
  • రుతుక్రమ హెల్త్ ట్రాకింగ్, ప్రెగ్నెన్సీ ఇన్‌సైట్స్
  • పర్సనలైజడ్ ఫిట్‌నెస్ గైడెన్స్ కోసం గార్మిన్ కోచ్
  • హైకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్కీయింగ్, గోల్ఫ్, HIIT, పైలేట్స్‌తో సహా ప్రీలోడెడ్ స్పోర్ట్స్ మోడ్‌లు

సేఫ్టీ, కనెక్టివిటీ ఫీచర్లు :

  • ఇన్‌స్టింక్ట్ 3 సిరీస్ టూ-వే మెసేజింగ్ కోసం గార్మిన్ మెసెంజర్‌కు సపోర్టు ఇస్తుంది.
  • లైవ్‌ట్రాక్, ఇన్సిడెంట్ డిటెక్షన్, అసిస్టెన్స్ అలర్ట్స్, సాహసికులకు అదనపు భద్రతను అందిస్తాయి.
  • రెడ్ లైట్, స్ట్రోబ్ మోడ్‌లతో కూడిన ఇంటర్నల్ LED ఫ్లాష్‌లైట్ రాత్రిపూట కూడా కనిపిస్తుంది.

బ్యాటరీ, స్టోరేజీ ఆప్షన్లు :

Read Also : Fake UPI Apps : ఫోన్‌పే, గూగుల్ పే యూజర్లకు బిగ్ అలర్ట్.. మీరు వాడేది ఫేక్ UPI యాప్ కావొచ్చు.. ఇప్పుడే చెక్ చేసుకోండి..!

  • గార్మిన్ ఇన్స్టింక్ట్ 3 సోలార్ : సరైన సూర్యకాంతిలో అన్‌‌లిమిటెడ్ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఇన్స్టింక్ట్ 2 సోలార్ కన్నా 5 రెట్లు మెరుగ్గా ఉంటుంది.
  • గార్మిన్ ఇన్స్టింక్ట్ 3 AMOLED : ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 రోజుల వరకు ఉంటుంది.
  • గార్మిన్ ఇన్స్టింక్ట్ E : 14 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.
  • స్టోరేజీ : ఇన్‌స్టింక్ట్ 3 అమోల్డ్ 4GB స్టోరేజీ కలిగి ఉంది. ఇన్‌స్టింక్ట్ E, సోలార్ మోడల్స్ 64MB స్టోరేజీని అందిస్తున్నాయి.

భారత్‌లో గార్మిన్ ఇన్స్టింక్ట్ 3 సిరీస్‌ ఎక్కడ కొనాలి? :
గార్మిన్ ఇన్‌స్టింక్ట్ 3 సిరీస్ ఇప్పుడు గార్మిన్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రీమియం రిటైల్ షాపులలో కొనుగోలు చేయొచ్చు.