Fake UPI Apps : ఫోన్‌పే, గూగుల్ పే యూజర్లకు బిగ్ అలర్ట్.. మీరు వాడేది ఫేక్ UPI యాప్ కావొచ్చు.. ఇప్పుడే చెక్ చేసుకోండి..!

Fake UPI Apps Alert : ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే లాగా కనిపించే ఫేక్ యాప్‌లతో స్కామర్‌లు కస్టమర్లను మోసం చేస్తున్న కొత్త మోసంపై సైబర్ నిపుణులు యూపీఐ యూజర్లను హెచ్చరిస్తున్నారు.

Fake UPI Apps : ఫోన్‌పే, గూగుల్ పే యూజర్లకు బిగ్ అలర్ట్.. మీరు వాడేది ఫేక్ UPI యాప్ కావొచ్చు.. ఇప్పుడే చెక్ చేసుకోండి..!

Fake UPI Apps Alert

Updated On : April 4, 2025 / 11:10 AM IST

Fake UPI Apps : యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీరు నిజంగా రియల్ యూపీఐ యాప్స్ వాడుతున్నారా? ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే.. అచ్చం అలాంటి ఫేక్ యూప్స్ క్లోన్ చేస్తున్నారు స్కామర్లు. అవే అసలైన యాప్స్ అనుకుని చాలామంది తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకుంటుంటారు.

ముఖ్యంగా మర్చంట్ యూపీఐ యూజర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇటీవలే Google Pay, PhonePe, Paytm వంటి UPI యాప్స్ వినియోగదారులకు సైబర్ భద్రతా నిపుణులు కొత్త హెచ్చరిక జారీ చేశారు.

Read Also : Moto G45 5G : బాబోయ్ ఏంటి డిస్కౌంట్.. ఇంత తక్కువలో 5G ఫోన్ వస్తే ఎవరైనా కొనేస్తారు.. కెమెరా ఫీచర్లు కేక..!

మోసగాళ్ళు రియల్ పేమెంట్ యాప్‌ల మాదిరిగానే కనిపించే ఫేక్ UPI యాప్‌లను క్లోన్ చేశారు. యూపీఐ వినియోగదారులు తమకు నిజంగానే పేమెంట్లు వచ్చాయని నమ్మేలా మోసగించారు. ఈ మోసాలు ప్రధానంగా దుకాణదారులు, వ్యాపారులు, చిన్న వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుంటాయి.

సౌండ్‌బాక్స్‌తో ఫేక్ యూపీఐ పేమెంట్లు :
సైబర్ మోసగాళ్ళు రిటైల్ షాపులలో నిజమైన పేమెంట్లగా నమ్మించేందుకు ఫేక్ యూపీఐ యాప్‌లను ఉపయోగిస్తారు. యూపీఐ దుకాణాలలోని సౌండ్‌బాక్స్ కూడా పేమెంట్ కన్ఫార్మేషన్ మెసేజ్ సౌండ్ వస్తుంది. కానీ, అసలు డబ్బు మీ అకౌంట్లలో పడదు.

డెక్కన్ క్రానికల్ ప్రకారం.. ఈ ఫేక్ యూపీఐ యాప్స్ టెలిగ్రామ్, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. చూసేందుకు అచ్చం రియల్ యూపీఐ యాప్స్ మాదిరిగానే ఉండటంతో యూజర్లకు అనుమానం కలగదు. దాంతో భారీగా నష్టపోవాల్సి వస్తుంది.

ఫేక్ UPI యాప్‌లు ఎలా పనిచేస్తాయి? :
సైబర్ నేరగాళ్లు ఒకే ఇంటర్‌ఫేస్‌లు, ఫీచర్లతో పాపులర్ యూపీఐ పేమెంట్ యాప్స్ క్లోన్ చేశారు. ఈ ఫేక్ యాప్స్ ద్వారా మోసపూరిత లావాదేవీలు జరిగే ప్రమాదం ఉంది. మీ లావాదేవీ పూర్తి అయినట్టేగా అనిపిస్తుంది. ఈ యాప్‌లలో కొన్ని పేమెంట్స్ జరిగిందని దుకాణదారులను నమ్మించేలా ఫేక్ పేమెంట్స్ ప్రాసెసింగ్ స్క్రీన్‌ను కూడా చూపిస్తాయి..

ఫేక్ UPI యాప్స్ నుంచి సేఫ్‌గా ఎలా ఉండాలి? :
యూపీఐ పేమెంట్లు చేసే ముందు మీ బ్యాంక్ అకౌంట్ లేదా యూపీఐ యాప్‌లో లావాదేవీలను ఎల్లప్పుడూ వెరిఫై చేసుకోండి. సౌండ్‌బాక్స్ నోటిఫికేషన్‌లపై మాత్రమే ఆధారపడవద్దు. ఎల్లప్పుడూ పేమెంట్ వివరాలను క్రాస్-చెక్ చేయండి.

యూపీఐ యాప్‌లను Google Play Store లేదా Apple App Store వంటి అధికారిక స్టోర్ల నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోండి. కస్టమర్లు లావాదేవీల కోసం ఉపయోగించే ఏవైనా కొత్త లేదా తెలియని పేమెంట్ యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి. మోసపూరిత లావాదేవీలను వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయండి. పోలీసులకు ఫిర్యాదు ద్వారా రిపోర్టు చేయండి.

Read Also : Infinix Note 40X 5G : వావ్.. స్పెషల్ డిస్కౌంట్.. భారీగా తగ్గిన ఇన్ఫినిక్స్ 5G ఫోన్.. ఫీచర్ల కోసమైనే కొనేసుకోవచ్చు!

యూపీఐ యూజర్లకు హెచ్చరిక :
డిజిటల్ పేమెంట్లు పెరుగుతున్న కొద్దీ, స్కామర్లు వినియోగదారులను మోసం చేసేందుకు కొత్త మార్గాలను కనుగొంటున్నారు. మీరు దుకాణదారుడు, బిజినెస్ మర్చంట్ లేదా సాధారణ యూపీఐ యూజర్ అయినా, లావాదేవీలను నిర్ధారించే ముందు ఎల్లప్పుడూ పేమెంట్లను వెరిఫై చేసుకోండి. ఇలాంటి పేమెంట్లపై అప్రమత్తంగా ఉండండి. ఫేక్ యూపీఐ యాప్స్ ట్రాప్‌లో పడకండి.