Gautam Adani: అదానీ ఆస్తులు మళ్లీ పెరిగుతున్నాయి.. మరోసారి ఆసియా సంపన్న జాబితాలో నెం.2కి వచ్చిన అదానీ

ఈ ఏడాది జనవరి నెలలో, అమెరికాకు చెందిన ఒక షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ విడుదల చేసిన నివేదిక అనంతరం అదానీ గ్రూప్ షేర్లలో భారీ పతనమయ్యాయి. దీని కారణంగా అదానీ గ్రూప్ భారీ నష్టాలను చవిచూసింది. హిండెన్‌బర్గ్ నివేదికలో అదానీ గ్రూప్ షేర్ల ధరను తారుమారు చేసిందని పేర్కొన్నారు

Gautam Adani: అదానీ ఆస్తులు మళ్లీ పెరిగుతున్నాయి.. మరోసారి ఆసియా సంపన్న జాబితాలో నెం.2కి వచ్చిన అదానీ

Gautam Adani

Bloomberg: గౌతమ్ అదానీ గ్రూప్ షేర్ల పెరుగుదల కారణంగా మరోసారి అదానీ ఆసియాలోనే రెండో అత్యంత సంపన్నుడిగా అవతరించారు. ఆయన నికర విలువ ప్రస్తుతం 160 మిలియన్ డాలర్లు పెరిగింది. అనంతరం ప్రపంచ సంపన్నుల జాబితాలో కూడా ఆయన ర్యాంక్ మెరుగుపడింది. 20వ స్థానం నుంచి తాజాగా 18వ స్థానానికి చేరుకున్నారు. అదానీ గ్రూప్ నికర విలువ ప్రస్తుతం 61.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మరోవైపు 18వ ర్యాంక్‌లో ఉన్న చైనాకు చెందిన జాంగ్ షన్షాన్ ఒక స్థానం ఎగబాకి 19వ ర్యాంక్‌లో ఉన్నారు.

Student used ChatGPT : హోంవర్క్ కోసం చాట్‌జిపిటిని ఉపయోగించి పట్టుబడ్డ స్టూడెంట్

అదే సమయంలో, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ 85.2 బిలియన్ డాలర్లతో ఇప్పటికీ ఆసియా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, మంగళవారం అదానీ గ్రూప్ షేర్లలో విపరీతమైన పెరుగుదల కనిపించింది. దీనితో పాటే ఆయన నికర విలువ పెరిగింది. 16 కోట్ల పెరుగుదలతో ఆయన నికర విలువ 61.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

Sandstorm: రాజస్థాన్‭లో 80 అడుగుల ఎత్తులో భయంకరమైన ఇసుక తుఫాను

విశేషమేమిటంటే, ఈ ఏడాది జనవరి నెలలో, అమెరికాకు చెందిన ఒక షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ విడుదల చేసిన నివేదిక అనంతరం అదానీ గ్రూప్ షేర్లలో భారీ పతనమయ్యాయి. దీని కారణంగా అదానీ గ్రూప్ భారీ నష్టాలను చవిచూసింది. హిండెన్‌బర్గ్ నివేదికలో అదానీ గ్రూప్ షేర్ల ధరను తారుమారు చేసిందని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని అదానీ గ్రూప్ పేర్కొంది.

Karnataka : ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు 50 శాతం సీట్ల కేటాయింపు .. సిద్దూ సర్కార్ వినూత్న నిర్ణయం

మరోవైపు, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్ సంపద చాలా వేగంగా పెరుగుతోంది. మంగళవారం షేర్లు పెరిగిన అనంతరం నికర విలువ 2.65 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఆ తర్వాత ఆయన నికర విలువ 205 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ట్విట్టర్, టెస్లా, స్పేస్ X సీఈవో అయిన ఎలోన్ మస్క్ సంపద ఈ సంవత్సరం 67.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ 187 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు.