Gold Rate Today: పండగే పండగ.. దిగొస్తున్న బంగారం ధరలు.. వరుసగా మూడోరోజు తగ్గుదల.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ్టి రేట్లు ఇలా..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.

Gold Rate Today: పండగే పండగ.. దిగొస్తున్న బంగారం ధరలు.. వరుసగా మూడోరోజు తగ్గుదల.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ్టి రేట్లు ఇలా..

Updated On : June 10, 2025 / 11:33 AM IST

Gold Rate Today: బంగారం కొనుగోలుకు చేసేందుకు సిద్ధమైన వారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్లు క్రమంగా తగ్గుతున్నాయి. గత శనివారం నుంచి బంగారం ధర వరుసగా తగ్గుతూ వస్తోంది. గడిచిన మూడు రోజుల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై సుమారు రూ.2వేలు తగ్గింది.

మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ. 110 తగగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 100 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు భారీగానే తగ్గింది. ఔన్స్ గోల్డ్ పై 17డాలర్లు తగ్గి.. ప్రస్తుతం 3,316 డాలర్ల వద్ద ట్రేడవుతుంది. వెండి ధర మాత్రం పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.89,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ.97,580 కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,600 కాగా.. 24 క్యారట్ల ధర రూ.97,730కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ. 89,450 కాగా.. 24క్యారెట్ల ధర రూ.97,580కు చేరింది.

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,19,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,09,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,19,000 వద్ద కొనసాగుతుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.