Gold Rate: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా.. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ రేటు..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై ..

Gold

Gold And Silver Price: అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కొద్దిరోజులుగా బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుంది. అయితే, శనివారం గోల్డ్ ధర కాస్త తగ్గగా.. ఆదివారంనాటి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. వెండి ధర కూడా స్థిరంగా కొనసాగుతుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం వంటి ప్రధాన నగరాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలను ఓసారి పరిశీలిద్దాం..

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.78,900 కాగా.. 24 క్యారట్ల ధర రూ.86,070.

దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే..
♦ ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.79,050 కాగా.. 24 క్యారట్ల ధర రూ.86,220.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో బంగారం ధర ఒకేలా ఉంది.. 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.78,900 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.86,070.

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో కిలో వెండి ధర రూ.1,08,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,00,500.
♦ చెన్నైలో కిలో వెండి ధ రూ. 1,08,000గా నమోదైంది.