Gold
Gold And Silver Price Today: బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే, మీకు బిగ్ షాక్. బంగారం ధర వరుసగా ఐదోరోజు భారీగా పెరిగింది. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ పై రూ. 710 పెరిగింది. 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 650 పెరిగింది. దీంతో గడిచిన ఐదు రోజుల్లో 24క్యారట్ల గోల్డ్ పై రూ.1594 పెరిగింది.
ప్రస్తుతం 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ.92వేల మార్క్ ను దాటేసింది. ఇది చరిత్రలోనే అత్యంత గరిష్ఠ స్థాయి అని చెప్పొచ్చు. వచ్చే వారం రోజుల్లో గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని. ఏప్రిల్ చివరి నాటికి 24క్యారట్ల గోల్డ్ రేటు రూ.95వేల మార్కును దాటిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ లోనూ బంగారం ధర భారీగా పెరిగింది. అతర్జాతీయ మార్కెట్లలో ఆదివారం గోల్డ్ రేటు ఔన్సుకు (31.10గ్రాములు) 3,085 డాలర్ల వద్ద కొనసాగగా.. 26డాలర్లు పెరిగి సోమవారం ఉదయానికి 3,111 డాలర్లకు చేరింది. వెండి ధర ఓన్సుకు 34 డాలర్ల దాటి ట్రేడింగ్ అవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.84,250 కాగా.. 24 క్యారట్ల ధర రూ.91,910 మార్క్ కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 84,400 కాగా.. 24 క్యారట్ల ధర రూ.92,060 మార్క్ కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 84,250 కాగా.. 24క్యారెట్ల ధర రూ.91,910కి చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,13,100 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,04,000గా నమోదైంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,13,000 వద్ద కొనసాగుతుంది.