Gold Rate: బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. హైదరాబాద్, విజయవాడలో ఇవాళ్టి గోల్డ్ రేటు ఇలా.. 10గ్రాముల 24క్యారట్లపై..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర ..

Gold
Gold And Silver Price: బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గడిచిన ఆరు రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. అమెరికా డాలర్ పుంజుకోవడంతో గత నాలుగు రోజులుగా గోల్డ్ ధరలు దిగొస్తున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం వరుసగా తగ్గిన గోల్డ్ రేటు.. ప్రస్తుతం స్వల్పంగా పెరిగింది. దేశీయంగా మాత్రం గోల్డ్ రేటు స్థిరంగానే కొనసాగుతుంది.
అంతర్జాతీయ మార్కెట్ లో నిన్న స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2,858 యూఎస్ డాలర్ల దగ్గరకు చేరుకోగా.. ఇవాళ స్వల్పంగా పెరిగి 2,862.41 డాలర్ల వద్ద కదలాడుతుంది. మరోవైపు వెండి ధర ఇప్పుడు 31.18 డాలర్ల దగ్గర కదలాడుతోంది. ఇదే సమయంలో డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 87.36 దగ్గర ట్రేడ్ అవుతుంది.
భారతదేశంలో బంగారం ధర తగ్గుతూ వస్తుంది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. గోల్డ్ రేటు స్థిరంగా కొనసాగుతుంది. దీంతో 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ.86,770 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారట్ల గోల్డ్ రేటు 79,550 వద్ద కొనసాగుతుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం వంటి ప్రధాన నగరాలతోపాటు.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే..
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.79,400 కాగా.. 24 క్యారట్ల ధర రూ.86,620.
దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే..
♦ ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,550 కాగా.. 24 క్యారట్ల ధర రూ.86,770గా నమోదైంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 79,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.86,620 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,05,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండిపై రూ.3వేలు తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.97,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,05,000గా నమోదైంది.