Gold price Today
Gold and Silver Rate Today 12th October 2023: బంగారం కొనుగోలుదారులకు ధరలు షాకిస్తున్నాయి. గత వారంరోజులుగా వరుసగా గోల్డ్ ధరలు పెరిగాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పండుగల సీజన్ కావడంతోపాటు, పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉండటంతో బంగారం కొనుగోలుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో వారం క్రితం వరకు భారీగా తగ్గిన గోల్డ్ ధర.. వారం రోజులుగా భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాకిస్తుంది. అయితే, గురువారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. గోల్డ్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 500 తగ్గుదల చోటు చేసుకుంది.
Gold
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల్లో గురువారం ఉదయం ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. దీంతో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 53,650కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 58,530 వద్ద కొనసాగుతుంది.
Gold
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 58,680.
– చెన్నైలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల గోల్డ్ పై రూ. 80 తగ్గింది. దీంతో చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 53,720 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,600.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 53,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,530 వద్ద కొనసాగుతుంది.
Gold
తగ్గిన వెండి ధర ..
దేశ వ్యాప్తంగా వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 500 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 75,000 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 75,000 కాగా, ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలలో కిలో వెండి రూ.72,100 వద్దకు చేరింది. బెంగళూరులో కిలో వెండి రూ. 71,000 గా ఉంది.