Gold And Silver Price Today : ఈనెల ప్రారంభం నుంచి దూకుడు ప్రదర్శిస్తున్న బంగారం ధర.. గతవారం రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే, నిన్న మరోసారి గోల్డ్ ధర భారీగా పెరిగింది. తాజాగా బుధవారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలో ఇవాళ ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,800 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,330 వద్ద కొనసాగుతుంది
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,950 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 66,480.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 60,800 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 66,330.
చెన్నైలో బంగారం ధర పెరిగింది. 10గ్రాముల బంగారంపై రూ.50 పెరిగింది. దీంతో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.61,400 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.66,980 మార్క్ కు చేరింది.
తగ్గిన వెండి ధర ..
దేశం వ్యాప్తంగా వెండిధర తగ్గింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 80,000 చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 80,000 కాగా, ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.77,000 కు చేరింది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.75,500 వద్ద కొనసాగుతుంది.