Gold Price Today : బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం, వెండి ధరలు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర

Gold

Gold and Silver Latest Prices: బంగారం కొనుగోలు దారులకు గుడ్ న్యూస్.. దేశంలోని పలు ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. శనివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం 10 గ్రాముల బంగారం ధర రూ. 57,490 కాగా, కిలో వెండి ధర రూ. 75,900 వద్ద కొనసాగుతుంది.

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,720 వద్ద కొనసాగుతుంది.

  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,640 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 62,870.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో .. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,490 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 62,720.
    చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,940 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.63,210 గా నమోదైంది.

  • తగ్గిన వెండి ధర ..
    దేశవ్యాప్తంగా వెండి ధర స్వల్పంగా తగ్గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 75,900 గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ. 75,900కాగా.. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.74,440కు చేరింది. బెంగళూరులో వెండి ధర పెరిగింది. దంతో అక్కడ కిలో వెండి ధర రూ.72,600 వద్ద కొనసాగుతుంది.

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు