Gold: మార్కెట్‌లో భారీ మార్పులు చోటుచేసుకునే ఛాన్స్‌.. ఇప్పుడుగనక మీరు బంగారం కొన్నారో..

సమీప భవిష్యత్తులో జరగబోయే మార్పులు ఏంటో తెలుసా?

ఇటీవల ఇతర కరెన్సీలతో పోల్చితే అమెరికా డాలర్ కాస్త బలహీన పడింది. అలాగే ద్రవ్యోల్బణం గురించి అంచనా వేసినదానికంటే కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్‌ (CPI) డేటా తక్కువగా వచ్చింది. అదే విధంగా అమెరికా, భారత్‌లో వడ్డీ రేట్ల తగ్గింపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి అంశాల వల్ల ఇటీవలే బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగి, దేశీయంగా అలాగే అంతర్జాతీయంగా కొత్త గరిష్ఠ స్థాయులను చేరుకున్నాయి.

“డాలర్ ఇండెక్స్ 103.75కి దిగువన ఉండటం, అంచనాలను అందుకోకుండా CPI డేటా తక్కువగా రావడం, వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలు ఎక్కువగా ఉండడం వల్ల బంగారం, వెండి ధరలు వారాంతంలో లాభాలను నమోదు చేసుకున్నాయి” అని ఆర్థిక నిపుణుడు జతీన్ త్రివేది అన్నారు.

అమెరికా వాణిజ్య విధానాలపై చర్చలు కొనసాగుతుండటంతో మార్కెట్‌లో హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉంది. ఏదైనా స్పష్టత రాకపోతే, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణ చేసేందుకు అవకాశం ఉంటుంది. అమెరికా వాణిజ్య విధానాల్లో తరచూ మార్పులు, ముఖ్యంగా టారిఫ్‌ల పెంపు, అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితిని వల్ల ‘బంగారం సేఫ్ హీవన్’ గా మారింది.

Also Read: త్వరలోనే ఈ సమస్య రానుందా? దీని నుంచి తప్పించుకోవడానికి బంగారం కొనడమే మార్గమా? 

బంగారం, వెండి ధరల పెరుగుదల వెనుక అనేక ప్రధాన కారణాలు ఉన్నాయి. SS వెల్త్‌స్ట్రీట్ వ్యవస్థాపకురాలు సుగంధా సచ్దేవా తెలిపిన వివరాల ప్రకారం, ఆర్థిక అనిశ్చితి పెరుగుతున్న పరిస్థితులు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అమెరికా డాలర్ బలహీనపడుతున్న నేపథ్యంలో, పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు.

అంతేకాకుండా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు పై ఊహాగానాలు కూడా బంగారం ధర పెరుగుదలకు తోడ్పడుతున్నాయి. ఇదే సమయంలో, వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు భారీ స్థాయిలో బంగారం కొనుగోలు చేయడం, ఈక్విటీ మార్కెట్ నుంచి పెట్టుబడులు మళ్లిపోవడం వంటి అంశాలు బంగారం, వెండి ధరలను మరింత పెంచుతున్నాయని అన్నారు.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాలు
సమీప భవిష్యత్తులో బంగారం ధరలపై ప్రభావం చూపే మరో ముఖ్య అంశం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో CPI డేటా అంచనాల కంటే తక్కువగా నమోదవ్వడం, ఫెడ్ జూన్‌లోనూ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న ఊహాగానాలకు కారణమైంది.

యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్.. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) 2025 సమావేశాలను ఇప్పటికే షెడ్యూల్ చేసింది. వీటిలో ఒకటి జూన్ 17 లేదా 18న జరగనుంది. ఈ సమావేశాలలో వడ్డీ రేట్లను సర్దుబాటు చేయడం వంటి ద్రవ్య విధాన చర్యలపై నిర్ణయం తీసుకోవడానికి ఎఫ్‌వోఎంసీ ఆర్థిక పరిస్థితులను అంచనా వేస్తుంది.

– ఫిబ్రవరి కోర్ CPI 0.2%గా నమోదైంది, ఇది 0.3% అంచనాల కంటే తక్కువ
– సంవత్సరానికి గాను CPI 2.8%కు పడిపోయింది, గత ఏడాది ఇది 3.0%గా ఉంది
– డాలర్ ఇండెక్స్ 4%కు పైగా పడిపోవడం వల్ల బంగారం పెట్టుబడులను మరింత ఆకర్షిస్తోంది

ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు గత మూడేళ్లుగా ప్రతి సంవత్సరం 1,000 టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. 2022లో రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షల తర్వాత, అనేక దేశాలు తమ విదేశీ మారకపు నిల్వలలో బంగారం వాటాను పెంచుతున్నాయి.

త్వరలో బంగారం ధరను ప్రభావితే చేసే అంశాలు
సుగంధా సచ్దేవా తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే వారంలో ముఖ్యంగా పరిశీలించాల్సిన అంశాలు ఫెడ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ సమావేశాలు, అలాగే అమెరికా రిటైల్ సేల్స్ డేటా, డాలర్ ఇండెక్స్. అంతేకాకుండా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు లేదా అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు మళ్లీ బంగారం మార్కెట్‌ను ప్రభావితం చేసే అవకాశముంది.

బంగారం ధరలు ఇప్పటికే $3,000 స్థాయులను దాటాయి. అలాగే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.అయితే, ధరలు పెరిగిన తర్వాత పెట్టుబడిదారులు లాభాలను స్వీకరించే అవకాశం కూడా ఉంది. వెండి MCX ధర రూ.1,01,999/కిలోకు చేరుకుని కొత్త గరిష్ఠ స్థాయిని తాకింది .

మొత్తం మీద, బంగారం, వెండి మార్కెట్ లో భారీ ఒత్తిడులు, ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే, ఇది మరింత పెరుగుతుందా లేక సమీప భవిష్యత్తులో లాభాల స్వీకరణ జరగుతుందా అనేది ప్రపంచ ఆర్థిక పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ఈ పరిణామాల మధ్య మీరు బంగారం కొంటే భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశాలే ఎక్కువ.