Gold Jewellery from Dubai : దుబాయ్ నుంచి బంగారాన్ని భారత్‌కు తీసుకువస్తున్నారా? పన్ను లేకుండా గోల్డ్ ఎంత తేవచ్చు అంటే? తప్పక తెలుసుకోండి!
Gold Jewellery from Dubai : పండుగ సీజన్‌లోనే చాలామంది కొత్త బంగారం కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అదే.. దుబాయ్ నుంచి బంగారాన్ని ఎంత మొత్తంలో తీసుకురావొచ్చు.. బంగారాన్ని పన్ను లేకుండా స్వదేశానికి తీసుకురాలేమా? ఎలాంటి పన్ను నిబంధనలు వర్తిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Gold Jewellery from Dubai _ How much Gold jewellery you can bring from Dubai without drawing taxmen’s in India
Gold Jewellery from Dubai : పండుగ సీజన్ వచ్చేస్తోంది.. పండుగ సమయంలోనే చాలామంది కొత్త బంగారం కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ప్రత్యేకించి కొనుగోలుదారులు బంగారంపై ఆఫర్లు, తగ్గింపు ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు. స్వదేశంలో బంగారం కొనుగోలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని.. అందుకే చాలామంది దుబాయ్‌లో నివసిస్తున్న తమ కుటుంబ సభ్యులను బంగారాన్ని తీసుకురావాలని కోరుతుంటారు. పండుగల సమయంలో భారత్‌కు తిరిగి వచ్చిన సమయంలో బంగారాన్ని తీసుకురావాలని అడుగుతుంటారు. ఎందుకంటే. దుబాయ్‌లో బంగారం ధర చాలా తక్కువగా ఉంటుంది. బంగారం క్వాలిటీతో పాటు రేటు కూడా చాలా చీప్ అని చెప్పవచ్చు. దుబాయ్‌లో బంగారంపై ఇన్‌కమ్ ట్యాక్స్ ఉండదు.. అలాగే ఎలాంటి పన్నులు వర్తించవు. అక్కడి బంగారం కూడా చాలా నాణ్యతతో ఉంటుంది. అందుకే దుబాయ్ నుంచి బంగారాన్ని భారత్‌కు స్మగ్లింగ్ చేసేవాళ్లు ఎక్కువగా ఉంటారు.
అక్కడ తక్కువ బంగారాన్ని కొనుగోలు చేసి.. భారత్ సహా ఇతర దేశాల్లో ఎక్కువ ఖరీదుకు అమ్మేస్తుంటారు. వాస్తవానికి.. దుబాయ్‌లో బంగారంపై కొన్ని లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. అందుకే దుబాయ్ బంగారంపై ట్యాక్స్ ఉండదు. అక్కడి బంగారం కొనుగోలు చేసి అక్రమ మార్గాల్లో భారత్‌కు తరలిస్తూంటారు. భారత చట్టాల ప్రకారం.. బంగారాన్ని ఎంతపడితే అంత స్వదేశానికి తీసుకురావడం కుదరదు.. దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకురావడానికి కొన్ని న్యాయపరమైన పన్ను చిక్కులు ఉన్నాయనే విషయం తప్పక తెలుసుకోవాలి.
భారత్‌తో పాటు పోలిస్తే.. దుబాయ్‌లో 14 శాతం నుంచి 20 శాతం వరకు బంగారం ధరలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు దుబాయ్‌లో కొన్నాళ్లు పాటు ఉండి.. అక్కడి నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే సమయంలో బంగారు ఆభరణాలను తీసుకురావాలని భావిస్తున్నారా? అయితే ఒకసారి ఆలోచించాల్సిందే.. వాస్తవానికి దుబాయ్ నుంచి ఎంతమొత్తంలో బంగారాన్ని తీసుకురావొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Gold Jewellery from Dubai _ How much Gold jewellery you can bring from Dubai
పెద్ద మొత్తంలో బంగారాన్ని దిగుమతి చేయొద్దు :
భారత్‌తో పోలిస్తే.. దుబాయ్‌లో బంగారం ధర సాధారణంగా చాలా తక్కువగా ఉంటుంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మేకింగ్ ఛార్జీలు, కరెన్సీ మార్పిడి ఖర్చులు, దిగుమతి సుంకం, పన్ను నియమాలు, GST వంటి ఇతర గుణకాల కారణంగా దుబాయ్ నుంచి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను దిగుమతి చేసుకోవడం అంతగా లాభదాయకం కాదనే విషయాన్ని తప్పక గుర్తించుకోవాలి.
పన్ను లేకుండా ఎంత బంగారాన్ని అనుమతిస్తారంటే? :
భారతీయ పన్ను నిబంధనల ప్రకారం.. ఎవరైనా దుబాయ్ నుంచి ఎక్కువ మొత్తంలో బంగారాన్ని తీసుకురావాలంటే ముందుగా మన దేశంలో బంగారం దిగుమతిపై ఎలాంటి నిబంధనలు, నియమాలు ఉన్నాయో తప్పక పాటించాలి. దుబాయ్ వంటి విదేశీ మార్కెట్ల నుంచి ఎలాంటి పన్ను చెల్లించకుండా చాలా తక్కువ మొత్తంలో బంగారాన్ని తీసుకువచ్చేందుకు అనుమతి ఉంటుంది. మరో విషయం ఏమిటంటే.. విదేశీ మార్కెట్ల నుంచి బంగారం, వెండిని ఆభరణాల రూపంలో మాత్రమే తీసుకురావొచ్చు. భారతీయ చట్టాల ప్రకారం.. బంగారం లేదా వెండిని ఆభరణాలు కాకుండా ఇతర ఏ రూపంలోనూ స్వదేశానికి దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉండదు.

Gold Jewellery from Dubai _ How much Gold jewellery you can bring from Dubai
ఒక ఏడాదికి పైగా విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పురుషులు బోనాఫైడ్ బ్యాగేజీలో డ్యూటీ లేకుండా రూ. 50వేలు విలువైన 20 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను తీసుకురావచ్చని పన్ను నిపుణులు అంటున్నారు. ఒక మహిళా ప్రయాణీకురాలు దుబాయ్ నుంచి ఒక లక్ష (రూ.1,00,000) విలువ కలిగిన 40 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను తీసుకురావచ్చు. అంతకంటే ఎక్కువ మొత్తంలో బంగారాన్ని ఇండియాకు తీసుకువస్తే మాత్రం.. 12.5 శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పన్ను చెల్లించి తీసుకెళ్లే బంగారంపై ఎలాంటి లిమిట్ ఉండదు. ఎంతైనా కొని తీసుకురావచ్చు.
ఒక ఏడాది కన్నా ఎక్కువ కాలం తర్వాత భారత్‌కు తిరిగి వచ్చే భారతీయ ప్రయాణీకుల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు & కస్టమ్స్ (CBIC) నిర్దేశించిన పరిమితులు విధించాయి. ఈ ప్రకారమే విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకునే వీలుంది. భారత్‌లోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) ట్యాక్స్‌మెన్ నుంచి తప్పించుకోలేరు. అందుకే భారత్‌లో బంగారాన్ని దిగుమతి చేసుకునే పరిమాణంపై పరిమితిని విధించారు. CBIC బంగారంపై డ్యూటీ-ఫ్రీ అలవెన్స్‌ను ఆభరణాల రూపంలో మాత్రమే అనుమతించింది. నాణేలు, బార్‌లు, బులియన్‌ల వంటి ఇతర రూపాల్లో బంగారాన్ని అనుమతి ఉండదనే విషయాన్ని తప్పక గుర్తించుకోవాలి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..