Gold Rates Today : బంగారం మళ్లీ షాకిచ్చిందిగా.. పసిడి ధరలు పైపైకి.. ఏకంగా రూ.85వేలు.. తులం లక్ష దాటేస్తుందా?

Gold Rates Today : ఆకాశమే హద్దుగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధర రూ. 85వేలు దాటేసింది. ఫిబ్రవరి 4 (మంగళవారం) బంగారం ధరలు నగరాల వారీగా ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Gold Price And Silver Rate Today

Gold Rates Today : బంగారం మళ్లీ షాకిచ్చింది.. పసిడి ధరలు పైపైకి దూసుకుపోతోంది. బంగారం ధరలు మరోసారి ఆల్ టైం రికార్డు స్థాయిగా దూసుకెళ్తున్నాయి. పసిడి ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే.. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 4 (మంగళవారం) బంగారం ధరలు నగరాల వారీగా ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆకాశమే హద్దుగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధర ఏకంగా రూ. 85వేలు దాటేసింది.

బంగారు ఆభరణాలు కొనేవారికి నిజంగా షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. మన హైదరాబాద్ నగరంలో పసిడి ధర ఆల్ టైం రికార్డును తాకేసింది. ఇప్పుడు బంగారం కొనేందుకు చూస్తున్నవారిలో ఆందోళన మొదలైంది. అందులోనూ డాలర్‌తో పోలిస్తే.. రూపాయి విలువ సైతం భారీగా పడిపోయింది. దీని కారణంగా కూడా పసిడి ధరలు పెరిగేందుకు దారితీసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read Also : Gold Rates Today : సామాన్యులు కొనేదెట్టా.. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి రెక్కలు.. మళ్లీ రికార్డు స్థాయిలో గరిష్టానికి.. భారత్‌‌లో ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు!

24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 85,200 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 78, 100 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్లో బంగారం ధర ఏకంగా రూ. 85వేలు దాటేసింది. బంగారం ధరల పెరుగుదలకు డాలర్ విలువ పెరగడమే కారణంగా తెలుస్తోంది. ప్రస్తుత ఒక డాలర్ విలువ రూ. 87. 11గా పతనమైంది. మార్కెట్ చరిత్రలోనే ఇది అత్యంత కనిష్టంగా చెప్పవచ్చు.

దీని కారణంగానే పసిడి ధరలు పైపైకి దూసుకుపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చర్యలతో అగ్రరాజ్యం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని నిపుణుల అంచనా. ట్రంప్ మెక్సికో కెనడాపైన ఆయన ఆంక్షలు తాత్కాలికంగా నిలిపివేసినా.. ఆ దేశాల పట్ల కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. భారత్‌లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఇదే క్రమంలో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. రానున్న రోజుల్లో బంగారం రూ. 90 వేల స్థాయి నుంచి లక్ష మార్క్ దాటేసేలా కనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలివే : 

హైదరాబాద్ నగరంలో గ్రాముకు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 7810గా ఉంటే, 8 గ్రాముల బంగారం ధర రూ. 62,480, 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 78,100గా ట్రేడ్ అవుతోంది. నిన్నటి ధర పోల్చితే ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1050కు పెరిగింది.

Read Also : World Cancer Day 2025 : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం.. యువతలో క్యాన్సర్ కేసులు ఎందుకు వేగంగా పెరుగుతున్నాయి.. ప్రధాన కారణాలు? నివారణ మార్గాలేంటి?

ఈరోజు బంగారం 10 గ్రాములకు ధర రూ.10 తగ్గింది. వెండి ధర కూడా రూ.100 తగ్గింది. పసిడి ధర రూ. 84,040 దాటాయి. వెండి ధర మాత్రం రూ. 99,500 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ. 8520 ఉంటే, 8 గ్రాముల బంగారం ధర రూ. 68,160, 10 గ్రాముల బంగారం ధర రూ. 85,200గా నమోదైంది. నిన్నటి ధరతో పోల్చితే ఈరోజు 10 గ్రాముల 24 క్యారట్ల పసిడి ధర రూ. 1,150కు పెరిగింది.

వెండి ధరల్లో గ్రాము వెండి ధర రూ. 106, 8 గ్రాముల వెండి ధర రూ. 848, 10 గ్రాముల వెండి ధర రూ. 1060కు చేరింది. నిన్నటి ధరతో పోల్చితే ఈరోజు వెండి ధర రూ. 10కు తగ్గింది. కిలో వెండి ధర నిన్న రూ.99,500గా ఉంటే.. ఈరోజు వెయ్యి తగ్గి రూ.98,500 వద్ద ట్రేడ్ అవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 84,190 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 77, 190వద్ద కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 84,040 వద్ద ఉండగా, 22 క్యారెట్ల రూ. 77, 040 వద్ద ట్రేడ్ అవుతోంది.