World Cancer Day 2025 : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం.. యువతలో క్యాన్సర్ కేసులు ఎందుకు వేగంగా పెరుగుతున్నాయి.. ప్రధాన కారణాలు? నివారణ మార్గాలేంటి?
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025 ఫిబ్రవరి 4న జరుపుకుంటున్నారు. క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి.. యువతలో కూడా క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రధాన కారణాలు, నివారణ మార్గాలేంటో తెలుసుకుందాం.

World Cancer Day 2025
World Cancer Day 2025 : ప్రతి ఏడాదిలో ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని (World Cancer Day 2025) జరుపుకుంటారు. ఈ రోజు (మంగళవారం) క్యాన్సర్ గురించి అవగాహన పెంచడంతో పాటు సమాచారాన్ని అందరికి చేరవేయడం, క్యాన్సర్ వ్యాధితో పోరాడేందుకు ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా, దాని నివారణ, చికిత్స, నియంత్రణకు ఎలాంటి మార్గాలు ఉన్నాయి. క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి.. దీని కారణంగా ప్రతి ఏడాదిలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. యువతలో కూడా క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయంగా చెప్పవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎలా నివారించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Read Also : Mental Health Study : మానసిక ఆరోగ్యంపై అధ్యయనం.. భారత్‌లో పురుషుల్లో కన్నా మహిళల్లోనే తీవ్ర ఒత్తిడి..!
ఫిబ్రవరి 2024 నాటికి భారత్‌లో 14 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య 2025 నాటికి 15 లక్షలకు చేరుకుంటుందని అంచనా. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. ఈ కేసుల్లో దాదాపు సగం యువతలోనే కనిపిస్తున్నాయి.
ఈ పరిస్థితి ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగించడమే కాకుండా సమాజం, ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. యువతలో క్యాన్సర్ కేసులు ఎందుకు వేగంగా పెరుగుతున్నాయి? నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.
యువతలో క్యాన్సర్ పెరగడానికి ప్రధాన కారణాలివే? :
అనారోగ్యకరమైన జీవనశైలి : నేటి బిజీ లైఫ్‌లో యువత తమ ఆహారంలో ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్లను ఎక్కువగా తీసుకుంటున్నారు. అందులో ఉండే హానికరమైన అంశాలు శరీర వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని బలహీనపరుస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
పొగాకు- మద్యం : సిగరెట్లు, గుట్కా, మద్యం సేవించడం వల్ల యువతలో క్యాన్సర్ వేగంగా పెరుగుతోంది. ఈ అలవాట్లు ఊపిరితిత్తులు, నోరు, గొంతు, కాలేయ క్యాన్సర్లకు ప్రధాన కారణాలుగా మారాయి.
ఊబకాయం-శారీరక శ్రమ లేకపోవడం : చెడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల యువతలో ఊబకాయం సమస్య పెరుగుతోంది. ఊబకాయం రొమ్ము, ప్రోస్టేట్, పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
కాలుష్యం-రసాయనాల ప్రభావం : పెరుగుతున్న వాయు కాలుష్యం, నీటిలో హానికరమైన రసాయనాలు, యూవీ కిరణాల ప్రభావం కూడా క్యాన్సర్ కేసులను పెంచుతున్నాయి.
ఒత్తిడి-నిద్ర లేకపోవడం : ఆధునిక జీవనశైలిలో, ఒత్తిడి, నిద్ర లేకపోవడం యువత ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
క్యాన్సర్ నివారణకు మార్గాలివే :
ఆరోగ్యకరమైన ఆహారం : పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. వ్యాధులతో పోరాడే శరీర సామర్థ్యాన్ని బలపరుస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Read Also : Garlic Health Benefits : పచ్చి వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే అసలు వదిలిపెట్టరు.. ప్రతిరోజూ ఇలా తిన్నారంటే అద్భుతంగా పనిచేస్తుంది!
పొగాకు, మద్యానికి దూరం : పొగాకు, మద్యం పూర్తిగా మానేయండి. క్యాన్సర్‌ను నివారించడానికి అత్యంత ముఖ్యమైన మార్గంగా చెప్పవచ్చు.
క్రమం తప్పకుండా వ్యాయామం : ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. బరువును నియంత్రిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కాలుష్యం నుంచి రక్షణ : కలుషిత ప్రాంతాలలో మాస్క్ ధరించండి. ఇంటి లోపల ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగించండి.
స్క్రీనింగ్, పరీక్షలు : క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, క్యాన్సర్ స్క్రీనింగ్‌లు చేయించుకోండి. క్యాన్సర్‌ను సకాలంలో గుర్తిస్తే చికిత్స చేయడం సులభం అవుతుంది.
అవగాహన పెంచండి : క్యాన్సర్ ప్రమాదాలు, నివారణ పద్ధతుల గురించి యువతకు అవగాహన కల్పించండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలని ప్రోత్సహించాలి.