Gold price Crash : పాత బంగారం మీ వద్ద ఉందా?.. ఇప్పుడే అమ్మేస్తున్న జనాలు.. ఇంకా ధరలు కుప్పకూలుతాయనే భయమే కారణమా?
Gold price Crash : పాత బంగారాన్ని అమ్మేందుకు జనమంతా క్యూ కట్టేస్తున్నారు. రోజురోజుకీ బంగారం డిమాండ్ పడిపోతుండటంతో ఇప్పుడే అమ్మేసుకోవడం బెటర్ అని భావిస్తున్నారు..
Gold price Crash
- పాత బంగారం అమ్మకాలకు క్యూ.. ఇంకా పడిపోతుందనే భయమా?
- రికార్డు ధరల తర్వాత షాక్.. పాత బంగారం అమ్మేస్తున్న భారతీయులు!
- బంగారం అమ్మకాలకు భారీ క్యూ.. రూ.1.2 లక్షలకు పడిపోతుందనే టెన్షన్
Gold price Crash : బంగారం ధర పడిపోతోంది.. ఇప్పుడే పాత బంగారం అమ్మేసుకోవడం బెటర్.. బంగారం రేటు తగ్గేకొద్ది ఇంట్లో బంగారానికి వాల్యూ పడిపోతుందని భయపడిపోతున్నారు.. అందుకే మార్కెట్లో పాత బంగారానికి ఫుల్ డిమాండ్ పెరిగిపోతోంది. వాస్తవానికి, ఈ ఏడాది ప్రారంభంలో రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన బంగారం ధరలు తర్వాత ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో భారతీయ కుటుంబాలు ఇంకా ధరలు భారీగా పడిపోతాయేమో అనే ఆందోళనతో పాత బంగారాన్ని అమ్మేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా చాలామంది తమ ఇళ్లలో ఉన్న పాత బంగారు నగలను అమ్మేందుకు పరుగులు తీస్తున్నారు. ఒకప్పుడు బంగారాన్ని తరాల సంపదగా భావించిన వారంతా ఇప్పుడు అదే బంగారాన్ని అవసరమైనప్పుడు క్యాష్‌గా మార్చుకోవాలని భావిస్తున్నారు.
43 శాతం పెరిగిన పాత గోల్డ్ సేల్స్ :
ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) అంచనాల ప్రకారం.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోనే దాదాపు 50 టన్నుల పాత బంగారం విక్రయించారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే.. 43 శాతం అధికంగా చెప్పొచ్చు.
గతంలో రూ.1.8 లక్షల వరకు వెళ్లిన 10 గ్రాముల గోల్డ్ ధర ప్రస్తుతం సుమారు రూ.1.4 లక్షలకు చేరింది. ఆపై రూ.1.2 లక్షల వరకు కూడా పడిపోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. దాంతో చాలామంది ఇప్పుడే ఉన్న బంగారమంతా అమ్మి భారీగా లాభాలను పొందాలని ఆరాటపడుతున్నారు.
గోల్డ్ రీసైక్లింగ్ ఊపు.. దిగుమతులతో పనిలేదు :
దేశంలో పాత బంగారాన్ని బయటకు తీయడం ద్వారా గోల్డ్ రీసైక్లింగ్ రంగానికి కొత్త ఊపునిస్తోంది. ముత్తూట్ ఎగ్జిమ్, ఆగ్మాంట్ వంటి సంస్థలు పాత గోల్డ్ కొనుగోలు చేసి శుద్ధి చేసి తిరిగి నగల తయారీదారులకు అందిస్తున్నాయి. తద్వారా కొత్తగా గనుల నుంచి బంగారం తవ్వాల్సిన అవసరం కొంతవరకు తగ్గుతుంది. అలాగే దిగుమతులపై ఆధారపడే పరిస్థితి కూడా క్రమంగా తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు.
30 వేల టన్నుల గోల్డ్ ఇళ్లలోనే.. ఇదే భారీ ఛాన్స్ :
భారతీయ కుటుంబాలు దాదాపు 30 వేల టన్నుల బంగారాన్ని దాచుకున్నారని అంచనా. అందులో ఎక్కువ మొత్తం బంగారం అసలు వినియోగంలోనే లేదు. ప్రస్తుతం పెరుగుతున్న రీసైక్లింగ్ ధోరణితో దేశ ఆర్థిక వ్యవస్థకు దాచిన బంగారమంతా మరింత ఉపయోగపడనుంది.
అయితే, నిపుణులు మాత్రం భయంతో కాకుండా వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసమో లేదా మార్కెట్ పరిస్థితులు, దీర్ఘకాల పెట్టుబడి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే బంగారం అమ్మడం లేదా కొనడం చేయడం బెటర్ అంటున్నారు.
