Gold: బాబోయ్.. మరో ఆల్‌టైమ్‌ హైకి గోల్డ్ రేటు.. ఎందుకలా పెరుగుతుంది.. కారణాలు ఏమిటంటే?

బంగారం ధరలు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి.

Gold: బాబోయ్.. మరో ఆల్‌టైమ్‌ హైకి గోల్డ్ రేటు.. ఎందుకలా పెరుగుతుంది.. కారణాలు ఏమిటంటే?

Gold

Updated On : April 1, 2025 / 9:43 AM IST

Gold Rate: బంగారం ధరలు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. తాజాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ రేటు 92వేల మార్కును దాటేసింది. ఫలితంగా ఆల్ టైమ్ హైకి గోల్డ్ రేటు దూసుకెళ్తోంది.

 

బంగారం ధర తగ్గేదే అంటూ పరుగులు పెడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో వివాదాస్పదన ప్రకటనతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంటుంది. దీంతో వారు ప్రత్యామ్నాయ పెట్టుబడుల సాధనాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇటర్నేషనల్ మార్కెట్ లో ఔన్స్ (28.34గ్రాముల) గోల్డ్ ధర 3,115 డాలర్ల (రూ.2.67లక్షల)ను అధిగమించింది. తద్వారా కిందటి వారంలోని శుక్రవారం సెషన్ లో నమోదు చేసిన ఆల్ టైమ్ హైని దాటింది. మరో వారం రోజుల్లో ఔన్స్ గోల్డ్ ధర 3,200 డాలర్లు దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో యూఎస్ ఎకానమీ రేసిషన్లోకి జారుకుంటుందనే భయాలు ఉండటంతో ఇన్వెస్టర్లు గోల్డ్ వైపు ప్రభావితం అవుతున్నాయి.

 

వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం బంగారంను భారీగా కొనుగోలు చేస్తుండటం, యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లు సడలింపు అంచనాలు, యూరప్ లో బౌగోళిక రాజకీయ అస్థిరత కారణంగా ఇన్వెస్టర్లు గోల్డ్ పై పెట్టుబడులు పెడుతుండటంతో బంగారం ధర భారీ పెరుగుదులకు కారణమవుతోంది. అయితే, రాబోయే కాలంలో బంగాంర ధర మరింత పైపైకి వెళ్లే చాన్స్ ఉందని ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి హైదరాబాద్ లో 10గ్రాముల 24 క్యాటర్ల బంగారం ధర రూ.710 పెరిగి రూ. 91,910లకు చేరుకుంది.