Gold Price Hike : మళ్లీ పెరిగిన బంగారం ధర.. రెండ్రోజుల్లో రూ.4వేలపైనే జంప్.. కారణాలు ఇవే.. మళ్లీ తగ్గేదెప్పుడంటే?
Gold Price Hike : బంగారం ధరల దూకుడు కొనసాగుతోంది. మరోసారి గోల్డ్ రేటు భారీగా పెరిగింది. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై..
Gold Price Today
Gold Price Hike : బంగారం ధరల దూకుడు కొనసాగుతోంది. సోమవారం గోల్డ్ రేటు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. 24క్యారట్ల 10గ్రాముల బంగారంపై రూ. 1800 పెరిగింది. అయితే, ఇవాళ కూడా గోల్డ్ రేటు భారీగా పెరిగింది.
మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.2,460 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 2,250 పెరిగింది. దీంతో రెండు రోజుల్లోనే 24క్యారట్ల బంగారంపై రూ. 4వేలకుపైగానే పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 14డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 4,128 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. దీంతో సోమ, మంగళవారాల్లో కిలో వెండిపై రూ. 5వేలు పెరుగుదల చోటు చేసుకుంది.
అమెరికా ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారటం, డాలర్ విలువ పడిపోవడంతో పెట్టుబడిదారులు బంగారాన్ని మాత్రమే సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. దీంతో గోల్డ్ కు మళ్లీ డిమాండ్ పెరిగి.. ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఫెడరల్ రిజర్వ్ తదుపరి సమావేశంలో వడ్డీ రేటు తగ్గుతుందనే అంచనాలు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, బ్యాంకింగ్ సంస్థ జూలియస్ బేర్ అంచనా ప్రకారం.. బంగారం రేట్లు మరో రెండుమూడు నెలల్లో సాధారణ స్థితికి వస్తాయని, గరిష్ఠంగా ఔన్సుకు 3,500 డాలర్ల వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,15,750 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,26,280కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,900కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,26,430కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,15,750 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,26,280కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,70,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,60,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,70,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
