Gold Price
Gold Rate: పండుగల వేళ బంగారం ధర భారీగా పెరిగింది. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.2,200 పెరిగింది. దీంతో 10 గ్రాముల పసిడి రూ.1,16,200కి చేరింది. ఇది రికార్డు గరిష్ఠ స్థాయి. 99.9 శాతం స్వచ్ఛతగల 10 గ్రాముల పసిడి ధర రూ.1,14,000 వద్ద ముగిసింది.
Also Read: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. దసరా అడ్వాన్స్ వచ్చేస్తోంది..
అలాగే, 99.5 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి ధర రూ.2,150 పెరిగి, రూ.1,15,650కు చేరింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలతో ఈ పరిస్థితి వచ్చింది. (Gold Rate)
ఆ నిర్ణయం ప్రభావం డాలర్, ట్రెజరీ యీల్డ్స్‌పై పడింది. 2025లో ఇప్పటివరకు బంగారం ధర దాదాపు రూ.37,250 (47.18 శాతం) పెరిగింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 10 గ్రాముల బంగారం ధరలు
24 క్యారెట్లు: రూ.1,13,080
22 క్యారెట్లు: రూ.1,03,660
18 క్యారెట్లు: రూ.84,820