Gold prices: బంగారం ధరలు రప్పా రప్పా పడిపోతాయ్.. రూ.56,000కి వచ్చేస్తుంది.. చెప్పింది ఎవరంటే..

అనేక కారణాల వల్ల ఇప్పుడు బంగారం ధరలను తగ్గిస్తాయని జాన్ మిల్స్‌ చెప్పారు.

బంగారం ధరలు భారీ స్థాయిలో పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో పెట్టుబడిదారులకు లాభాలు వస్తున్నా, ఆభరణాల కోసం బంగారం కొనుగోలు చేసేవారు మాత్రం తగ్గిపోతున్నారు. బంగారం ధరలు ప్రస్తుతం పెరుగుతున్నప్పటికీ అమెరికా మార్నింగ్‌స్టార్ విశ్లేషకుడు జాన్ మిల్స్‌ రాబోయే కొన్నేళ్లలో బంగారం ధరలు 38 శాతం తగ్గుదలని అంచనా వేశారు.

ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.90,000, ప్రపంచ మార్కెట్లలో ఔన్సుకు 3,100 డాలర్లుగా ఉంది. కొన్నేళ్లలో బంగారం ధర దాదాపు 40 శాతం తగ్గితే భారత్‌లో 10 గ్రాముల ధర రూ.56,000కు తగ్గుతుంది. అలాగే, ప్రస్తుతం అంతర్జాతీయంగా ఔన్సుకి 3,080 డాలర్లుగా ఉన్న బంగారం ధరలు 810 డాలర్లకు తగ్గుతాయని జాన్ మిల్స్‌ అంటున్నారు.

Also Read: రూ.14 వేల డిస్కౌంట్‌.. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీ వద్ద ఉంటే హీరోలా ఫీలైపోవచ్చు..

ఎందుకు తగ్గుతాయి?
ఇటీవల గోల్డ్ ర్యాలీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఆజ్యం పోశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తిగా బంగారం వైపు చూస్తున్నారు. ఏదేమైనా, అనేక కారణాల వల్ల ఇప్పుడు బంగారం ధరలను తగ్గిస్తాయని జాన్ మిల్స్‌ చెప్పారు.

సరఫరా పెరుగుతుండడంతో బంగారం ధరలు కొన్నేళ్లలో తగ్గే అవకాశం ఉంది. 2024 రెండవ త్రైమాసికంలో మైనింగ్ లాభాలు ఔన్స్‌కు 950 డాలర్లకు చేరుకున్నాయి. గ్లోబల్ రిజర్వ్స్ 9 శాతం పెరిగి, 2,16,265 టన్నులకు చేరుకున్నాయి. ఆస్ట్రేలియా కూడా ఉత్పత్తిని పెంచుతుంది.. బంగారు సరఫరాను రీసైకిల్ చేసింది.

డిమాండ్ తగ్గుతుండడంతో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. గత సంవత్సరం 1,045 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి సెంట్రల్ బ్యాంకులు. ఇకపై కొనుగోళ్లను తగ్గించవచ్చు. ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ సర్వేలో 71 శాతం సెంట్రల్ బ్యాంకులు తమ బంగారు హోల్డింగ్లను తగ్గించడానికి యోచిస్తున్నాయని తెలిసింది.

బంగారం రంగంలో విలీనాలు వంటివి 2024లో 32 శాతం పెరిగాయి. ఈ మార్కెట్‌ పీక్స్‌కి చేరిందనడానికి ఇది ఓ సంకేతం. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల పెరుగుదల కూడా భవిష్యత్తులో ధరలు తగ్గానికి కారణం కావచ్చు.