రూ.14 వేల డిస్కౌంట్‌.. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీ వద్ద ఉంటే హీరోలా ఫీలైపోవచ్చు..

అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది.

రూ.14 వేల డిస్కౌంట్‌.. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీ వద్ద ఉంటే హీరోలా ఫీలైపోవచ్చు..

Updated On : April 3, 2025 / 5:49 PM IST

చాలా ఖరీదైన స్మార్ట్‌ఫోన్ మీ వద్ద ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారా? ఏదైనా ఆఫర్‌ ఉంటే వెంటనే కొనేద్దామని భావిస్తున్నారా? ఒకవేళ రూ.1,09,999 స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,000 డిస్కౌంట్ ఉంటే కొంటారా? ఇటువంటి ఆఫరే విజయ్‌ సేల్స్‌ వెబ్‌సైట్‌లో ఉంది.

గూగుల్ పిక్సెల్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో భారీ ధరల తగ్గింపు ధరలో లభ్యమవుతోంది. అయితే, అందుకు పలు ఆఫర్లను వాడుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోన్‌ను రూ.14,000కే ఎలా సొంతం చేసుకోవచ్చో చూద్దామా?

గూగుల్ పిక్సెల్ 9 ప్రో ధర మన దేశంలో రూ.1,09,999. విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో రూ.99,999కే అందుబాటులో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ఈఎంఐతో కొంటే అదనంగా రూ.4,000 తగ్గింపు ధరను పొందవచ్చు.

ఫీచర్లు
గూగుల్ పిక్సెల్ 9 ప్రో 6.3 అంగుళాల డిస్ప్లేతో వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేటు, 3,000 NITS వరకు బ్రైట్‌నెస్‌తో దీన్ని లాంచ్‌ చేశారు. అలాగే, ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 కవర్ గ్లాస్‌ వాడారు.

గూగుల్ పిక్సెల్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో టెన్సర్ జీ 4 చిప్‌సెట్ ఉంది. 16 జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్‌తో వచ్చింది. 4,700 mAh బ్యాటరీ సామర్థ్యంతో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో దీన్ని తీసుకొచ్చారు.

పిక్సెల్ 9 ప్రోలో 50 ఎంపీ ప్రైమరీ షూటర్, 48 ఎంపి అల్ట్రావైడ్ సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్‌తో 48 MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్‌లో 42MP సెల్ఫీ షూటర్ ఉంది.