Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర

పసిడి ధరలు వరుసగా రెండో రోజు భారీగా తగ్గిపోయాయి. అయితే, చాలా నగరాల్లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర 50వేలకు దగ్గరగా ఉంది.

Gold Rate Today: పసిడి ధరలు వరుసగా రెండో రోజు భారీగా తగ్గిపోయాయి. అయితే, చాలా నగరాల్లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర 50వేలకు దగ్గరగా ఉంది. దేశవ్యాప్తంగా నగల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.45,500గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.400 తగ్గింది. హైదరాబాద్‌లో గ్రాము బంగారం 4వేల 550రూపాయలకు లభిస్తోంది.

24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్‌లో 50వేలు దాటింది. పెట్టుబడుల్లో ఎక్కువగా వినియోగించే స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.49,450గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.350 తగ్గింది. ఒక్క గ్రాము ప్యూర్ గోల్డ్ రేటు హైదరాబాద్‌లో రూ.4,945గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.45,500గా ఉంది.

Pushpa : ‘పుష్ప’ సినిమాని ఈ స్టార్లంతా వద్దు అనుకున్నారు.. ఇప్పుడు బాధపడుతున్నారు..

బంగారంతో పాటు వెండి ధర కూడా తగ్గుతూ వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాముల వెండి రూ.685గా ఉంది. నిన్నటితో పోల్చితే 10 గ్రాములు వెండి రేటు రూ.8 తగ్గింది. కేజీ వెండి రూ.68వేల 500కి లభిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, చెన్నై, కేరళలో వెండి ధరలు ఒకేలా ఉన్నాయి. ఆయా నగరాల్లో వెండి రూ.685కి లభిస్తోంది.

Kanipakam Temple : కాణిపాకం ఆలయ సమీపంలో దారుణం.. పాత రథ చక్రాలకు నిప్పు పెట్టిన దుండగులు

ట్రెండింగ్ వార్తలు