Gold Rates : మరోసారి భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. వినాయక చవితి నాటికి పసిడి ధర మరింత తగ్గబోతుందా.. కారణాలు ఇవే..

బంగారం కొనుగోలుకు సిద్ధమవుతున్న వారికి గుడ్‌న్యూస్. మంగళవారం గోల్డ్ రేటు (Gold Rates) భారీగా తగ్గింది.

Gold Rates

Gold Rates : బంగారం కొనుగోలుకు సిద్ధమవుతున్న వారికి గుడ్‌న్యూస్. గత పదిరోజులుగా దేశంలో గోల్డ్ రేటు (Gold Rates) క్రమంగా తగ్గుతూ వస్తోంది. గడిచిన రెండు వారాల్లో 10 గ్రాముల బంగారంపై రూ.2,300 తగ్గింది. అయితే, మంగళవారం కూడా గోల్డ్ రేటు (Gold Rates) భారీగా తగ్గింది.

మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ.430 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై 400 తగ్గింది. మరోవైపు అంతర్జాతీయంగా గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై ఏడు డాలర్లు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 3,339 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదిలాఉంటే వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండిపై రూ.వెయ్యి తగ్గింది.

అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండటంతో గోల్డ్ రేటు క్రమంగా తగ్గుతుంది. రష్యా, యుక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తో భేటీ అయిన ట్రంప్.. తాజాగా యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ, యూరప్ దేశాల అధినేతలు, ఈయూ, నాటో నేతలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో త్వరలోనే యుక్రెయిన్ – రష్యా యుద్ధానికి ఎండ్ కార్డ్ పడుతుందని అందరూ భావిస్తున్నారు. మరోవైపు ఇటీవలి వరకు అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న సంకేతాల నేపథ్యంలో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారంకు డిమాండ్ తగ్గింది. దీంతో క్రమంగా గోల్డ్ రేటు తగ్గుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే.. వినాయక చవితి నాటికి గోల్డ్ రేటు మరింత తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.92,350 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,00,750 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,500 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,00,900 వద్ద కొనసాగుతుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.92,350 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,00,750కు చేరింది.

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ కిలో వెండిపై రూ.వెయ్యి తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,26,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,16,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,26,000 వద్ద కొనసాగుతుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

Also Read: Telugu Indian Idol Season 4 : తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 లాంచింగ్ ఈవెంట్‌.. ఎప్పుడు, ఎక్క‌డో తెలుసా?