Gold Silver Rate Today : బంగారం కొనేవారికి బిగ్ షాక్.. బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు.. నేటి ధరలు ఇవే..
Gold Silver Price Today : బంగారం, వెండి ధరల్లో ఇవాళ కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గోల్డ్ రేటు పెరగ్గా.. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

బంగారం కొనేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. కొద్దిరోజులుగా తగ్గుముఖం పడుతూ వచ్చిన గోల్డ్ రేటు ఇవాళ భారీగా పెరిగింది. వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది.

గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 330 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 300 పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 8డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,699 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం వెండి రేటు కిలోపై రూ. 10వేలు పెరగ్గా.. ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,52,460 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,39,750 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,52,390కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,39,900 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,52,460కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,39,750 వద్ద కొనసాగుతుంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,75,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,70,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,75,000 వద్దకు చేరింది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
