Gold ATM: హైదరాబాద్‌లో మరో గోల్డ్ ఏటీఎం.. బంగారం ఎలా తీసుకోవాలి..? లావాదేవీలు తరువాత గోల్డ్ కాయిన్ రాకుంటే ఏం చేయాలంటే ..

గోల్డ్ సిక్కా సంస్థ ఆధ్వర్యంలో అమీర్ పేట మెట్రో స్టేషన్ ప్రాంగణంలో గోల్డ్ ఏటీఎంను ఏర్పాటు చేశారు. గతేడాది డిసెంబర్ నెలలో బేగంపేటలో తొలిసారి గోల్డ్ ఏటీఎంను గోల్డ్ సిక్కా సంస్థనే ఏర్పాటు చేసింది.

Gold ATM

Gold ATM in Hyderabad : ఏటీఎం అంటే మనకు టక్కున గుర్తుకొచ్చేది మనీ ఏటీఎం. మనకు కావాల్సినప్పుడల్లా ఏటీఎం వద్దకు వెళ్లడం మనకు కావాల్సినంత డబ్బును తీసుకోవటం నిత్యం చేసేపనే. అంతేకాదు, మన అకౌంట్లోకి, వేరేవాళ్ల అకౌంట్లలోకి డబ్బులుకూడా ఏటీఎం ద్వారా జమ చేయడం మనం చూశాం. డబ్బులువలే బంగారాన్ని ఏటీఎం ద్వారా తీసుకోవచ్చని మీకు తెలుసా? ఇందుకోసం బంగారం ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. బటన్ నొక్కితే గలగలమంటూ మీకు కావాల్సిన బంగారు నాణేలు బయటకొస్తాయి. ఈ సదుపాయం వేరే దేశాలు, రాష్ట్రాల్లోకాదు.. మన హైదరాబాద్ లో అందుబాటులో ఉంది. భాగ్యనగరంలో తాజాగా గోల్డ్ ఏటీఎం ప్రారంభమైంది. గతేడాది దేశంలోనే మొదటిసారి బేగంపేటలో ఈ గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. తాజాగా అమీర్ పేట మెట్రో స్టేషన్ లో దీనిని ఏర్పాటు చేశారు. అయితే, ఈసారి మరిన్ని కొత్త హంగులతో దీనిని ఏర్పాటు చేశారు.

Also Read : Gold Price Today: గోల్డ్ కొనుగోలుదారులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత తగ్గిందంటే..

హైదరాబాద్ లో రెండోది..
గోల్డ్ సిక్కా సంస్థ ఆధ్వర్యంలో అమీర్ పేట మెట్రో స్టేషన్ ప్రాంగణంలో గోల్డ్ ఏటీఎంను ఏర్పాటు చేశారు. గతేడాది డిసెంబర్ నెలలో బేగంపేటలో తొలిసారి గోల్డ్ ఏటీఎంను గోల్డ్ సిక్కా సంస్థనే ఏర్పాటు చేసింది. ఈసారి మరిన్ని సదుపాయాలతో కూడిన వర్షన్ -2 గోల్డ్ ఏటీఎంను అందుబాటులోకి తెచ్చారు. గతేడాది ఏర్పాటు చేసిన ఏటీఎం ద్వారా కేవలం డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారానే నాణేలు డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఏటీఎం నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు యూపీఐ విధానంలో కావాల్సిన బంగారం, వెండి నాణేలను డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

Also Read : Gold Loan : బంగారంపై రుణం తీసుకుంటున్నారా? ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి!

ఎలా తీసుకోవాలి?
అమీర్ పేట్ మెట్రోస్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గోల్డ్ ఏటీఎం నుంచి 0.5 గ్రాములు నుంచి 20 గ్రాముల వరకు బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. బ్యాంకులు ఏర్పాటు చేసిన ఏటీఎంలో డబ్బులు తీసుకున్న విధంగానే గోల్డ్ సిక్కా ఏటీఎంలో బంగారు, వెండి కాయిన్లు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఏటీఎంలో నిర్దేశించిన విధంగా లావాదేవీ పూర్తయిన వెంటనే మనం ఎంచుకున్న బంగారం కాయిన్లు బయటకు వస్తాయి. బంగారం, వెండి కాయిన్లను ఎంపిక చేసుకొని నిర్దేశించిన నగదు మొత్తాన్ని డెబిట్, క్రెడిట్, యూపీఐ పేమెంట్స్ ద్వారా చెల్లించాలి. ఆ తరువాత గలగలమంటూ బంగారం లేదా వెండి నాణేలు ఏటీఎం నుంచి బయటకు వస్తాయి.

Also Read : Gold Jewellery from Dubai : దుబాయ్ నుంచి బంగారాన్ని భారత్‌కు తీసుకువస్తున్నారా?  పన్ను లేకుండా గోల్డ్ ఎంత తేవచ్చు అంటే? తప్పక తెలుసుకోండి!

ఎక్కువ డబ్బులు చెల్లించాలా?
గోల్డ్ సిక్కా ఏటీఎం ద్వారా గోల్డ్ తీసుకుంటే డబ్బులు ఎక్కువ చెల్లించాల్సి వస్తుందేమోననే డౌట్ రావొచ్చు.. అలాంటిదేమీ లేదని గోల్డ్ సిక్కా కంపెనీ తెలిపింది. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలనే తీసుకుంటారు. త్వరలో వైజాగ్ లోనూ ఈ గోల్డ్ ఏటీఎంను అందుబాటులోకి రానుంది. అంతేకాక, తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ గోల్డ్ ఏటీఎంలు ఏర్పాటు చేసేందుకు గోల్డ్ సిక్కా కంపెనీ సిద్ధమవుతుంది.

Also Read : WhatsApp Web Users : వాట్సాప్‌ వెబ్ యూజర్లు త్వరలో ఫోన్ నెంబర్ బదులుగా యూజర్ నేమ్‌తో కనెక్ట్ అవ్వొచ్చు..!

నగదు జమైనా నాణేలు రాకుంటే .. 
గోల్డ్ ఏటీఎం ద్వారా 99.99శాతం స్వచ్ఛత కలిగిఉన్న బంగారాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. బంగారం ధరలు ఎప్పటికప్పుడు ఏటీఎం స్క్రీన్ పై కనిపిస్తాయి. ట్యాక్స్ లు కూడా కలిపే ఉంటాయి. ఒకవేళ లావాదేవీలు జరిగిన తరువాత బంగారం కాయిన్ రాకపోతే 24గంటల్లో మీ డబ్బు రీఫండ్ చేస్తారు. కస్టమర్ కేర్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.