EPF Subscribers : ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. UPI, ATMలోనే PF డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.. ఎప్పటినుంచంటే?
EPF Subscribers : ఈపీఎఫ్ఓ ఖాతాదారులు యూపీఐ, ఏటీఎం కార్డుల ద్వారా పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి ప్రక్రియ తుది దశలో ఉందని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
EPF Subscribers
- ఈ నెలాఖరులోగా ఈపీఎఫ్ఓ 3.0 అమల్లోకి రానుంది
- జూన్ నెలాఖరులో యూపీఐ, ఏటీఎంలో పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు
- ఆధార్, బ్యాంకు ఖాతాలకు లింక్ పీఎఫ్ ఫండ్స్ లింక్ తప్పనిసరి
- పీఎఫ్ బ్యాలెన్స్‌లో కనీసం 25శాతం రిటైర్మెంట్ ఫండ్ ఖాతాలోనే
EPF Subscribers : పీఎఫ్ సభ్యులకు భారీ శుభవార్త.. అతి త్వరలో యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు. ఈ నెలాఖరులోగా ఈపీఎఫ్ఓ 3.0 అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఈ కొత్త సదుపాయం ఫైనల్ స్టేజీకి వచ్చింది.
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) సభ్యులు, యూపీఐ, ఏటీఎం కార్డుల ద్వారా డబ్బు విత్‌డ్రా చేసుకోగలరు. ఈ సర్వీసు (EPF Subscribers) జూన్ నెలాఖరులోగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కొత్త వెర్షన్ 2.01 సర్వర్ అందుబాటులోకి రానుంది.
ఒకసారి ఇది అమల్లోకి వస్తే ఈపీఎఫ్ఓ సభ్యులు తమ ఫండ్స్ నేరుగా యూపీఐ, ఏటీఎంల ద్వారా తెచ్చుకోవచ్చు. అయితే, అర్హులైన సభ్యులు యూపీఐ లేదా ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బులను తీసుకోవచ్చు. అయితే, ముందుగా ఆధార్, బ్యాంకు ఖాతాలకు లింక్ పీఎఫ్ ఫండ్స్ లింక్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే పీఎఫ్ డబ్బులను ట్రాన్స్ ఫర్ చేయడం లేదా డబ్బు విత్‌డ్రా చేయగలరు. పేపర్ వర్క్, క్లెయిమ్ ఆలస్యం వంటివి ఉండవు.
పీఎఫ్‌లో ఎంత విత్‌డ్రా చేయొచ్చు? :
ప్రతిపాదిత ఫ్రేమ్‌వర్క్ ప్రకారం.. ఈ సౌకర్యం అమల్లోకి వచ్చాక షరతులు, అర్హతా ప్రమాణాలకు తగినట్టుగా అర్హులైన ఈపీఎఫ్ఓ చందాదారులు యాక్టివ్ ఈపీఎఫ్ ఫండ్ 50శాతం నుంచి 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, పీఎఫ్ మొత్తం బ్యాలెన్స్‌లో కనీసం 25శాతం రిటైర్మెంట్ ఫండ్ ఖాతాలోనే ఉంటుంది. లాంగ్ టైమ్ సేవింగ్ రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక భద్రత అందించడమే ఈ నిబంధన లక్ష్యం.
ఈపీఎఫ్ఓ 3.0 లేటెస్ట్ ఫీచర్లు :
- రూ. 5 లక్షల వరకు అడ్వాన్స్ క్లెయిమ్ ఇప్పుడు ఆటో-సెటిల్మెంట్ చేయొచ్చు.
- గతంలో కన్నా క్లెయిమ్ ప్రాసెసింగ్ చాలా స్పీడ్ ఉంటుంది.
- ప్రొఫైల్ రికార్డు మార్పుల కోసం పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.
- EPFO 3.0 ప్రకారం.. కొన్ని మార్పులకు కంపెనీ లేదా ఈపీఎఫ్ఓ ఆమోదం తప్పనిసరి
- ఆధార్ ఆధారిత అథెంటికేషన్, డిజిటల్ వెరిఫికేషన్ క్లెయిమ్ విత్‌డ్రా ప్రాసెస్
- కొన్ని కేవైసీ రికార్డు కేసులలో కంపెనీ అనుమతి ఇంకా అవసరం ఉండొచ్చు
యూపీఐ, యూపీఐ-ఎనేబుల్డ్ ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్‌డ్రాయల్స్‌ను వేగవంతం చేసేందుకు ఈపీఎఫ్ఓ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే టెస్టింగ్ పూర్తయినట్లు సమాచారం. ఈ రిటైర్మెంట్ ఫండ్ సంస్థ ఇంకా ఫైనల్ తేదీని ప్రకటించలేదు.
ఇవి తప్పనిసరిగా పూర్తి చేయండి :
- మీ (UAN)తో ఆధార్‌ను లింక్ చేయండి.
- ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్‌లో మీ బ్యాంక్ ఖాతా వివరాలను వెరిఫై చేసుకోండి.
- ఆధార్, పాన్ ఈపీఎఫ్ఓ రికార్డులలో వ్యక్తిగత వివరాలు మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేయండి.
- లింక్ చేసిన బ్యాంక్ ఖాతాతో మీ యూపీఐ ఐడీని సెటప్ చేసి వెరిఫై చేయండి.
- డిజిలాకర్‌లో రిజిస్టర్ చేసుకోండి.
- అన్ని వివరాలు మ్యాచ్ అయితే పీఎఫ్ క్లెయిమ్ ఆలస్యం అవ్వదు.
