YouTube Premium : వినియోగదారులకు బిగ్ షాకిచ్చిన యూట్యూబ్.. ప్రీమియం ప్లాన్ల ధరలు పెంపు

భారతదేశంలోని యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కలిగిన వినియోగదారులకు బిగ్ షాకిచ్చింది. యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ల ధరలను పెంచేసింది.

YouTube

YouTube Premium Price Hike : భారతదేశంలో యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కలిగిన వారికి షాకింగ్ న్యూస్.. యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ల ధరలను పెంచేసింది. దాదాపు 58శాతం ఈ ధరలు పెరిగాయి. ప్రతి సంవత్సరం యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ల ధరలను పెంచడం లేదా తగ్గించడం చేస్తోంది. అయితే, ఈసారి యూట్యూబ్ లో యాడ్ ఫ్రీ కంటెంట్ కావాలనుకునే వారికి ధరల మోత మోగనుంది. ఇటీవల టారిఫ్ చార్జీలు కూడా పెరిగాయి. ఇప్పుడు యూట్యూబ్ సబ్‌స్క్రిప్షన్ ప్రీమియం ప్లాన్స్ ధరలు పెరగడంతో వినియోగదారులపై అధనపు భారం పడనుంది.

Also Read : Tech Tips in Telugu : మీ స్మార్ట్‌ఫోన్‌ను టీవీ రిమోట్‌గా ఇలా మార్చేయండి.. సింపుల్ టిప్స్ మీకోసం..!

విద్యార్థి, వ్యక్తిగత, కుటుంబ ప్లాన్స్ కు సంబంధించి ధరలు పెరిగాయి. కొత్త ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. యూట్యూబ్ ధరల పెంపునకు సంబంధించి ఇప్పటికే ఉన్న వినియోగదారులకు ఇ- మెయిల్స్ పంపడం ప్రారంభించింది. చందా కొనసాగించడానికి వినియోగదారులు కొత్త ధరలను చెల్లించాల్సి ఉంటుంది. అత్యధికంగా యూట్యూబ్ ప్రీమియం ఫ్యామిలీ ప్లాన్ నెలకు రూ.110 పెరిగింది. ఇదిలాఉంటే.. యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కలిగినఉన్నవారు యాడ్స్ లేకుండా వీడియోలను వీక్షించవచ్చు. 1080pలో అధిక బిట్‌రేట్ స్ట్రీమింగ్, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్, బ్యాక్‌గ్రౌండ్ ప్లేబ్యాక్, యూట్యూబ్ మ్యూజిక్ లో యాడ్స్ లేకుండా చూడొచ్చు. ఇలా పలు ప్రయోజలను సబ్‌స్క్రిప్షన్ కలిగిన వారు పొందొచ్చు.

Also Read : Whatsapp Status Trick : ఇతరుల వాట్సాప్ స్టేటస్‌ను సీక్రెట్‌గా ఇలా చూడొచ్చు తెలుసా?

యూట్యూబ్ మొత్తం ఆరు ప్రీమియం ప్లాన్ల ధరలను పెంచింది. ఈ కొత్త రేట్ల వివరాల ఇలా ఉన్నాయి.
వ్యక్తిగత నెలవారి ప్లాన్ : రూ. 129 నుండి రూ. 149కి పెరిగింది.
విద్యార్థి నెలవారి ప్లాన్ : రూ. 79 నుండి రూ. 89కి పెరిగింది.
కుటుంబ నెలవారి ప్లాన్ : రూ. 189 నుంచి రూ.299కి పెరిగింది.
వ్యక్తిగత ప్రీపెయిడ్ నెలవారి ప్లాన్ : రూ. 139 నుంచి రూ. 159కి పెరిగింది.
వ్యక్తిగత త్రైమాసిక ప్లాన్ : రూ. 399 నుంచి రూ. 459కి పెరిగింది.
వ్యక్తిగత వార్షిక ప్రణాళిక : రూ. 1,290 నుంచి రూ. 1,490కి పెరిగింది.

 

 

ట్రెండింగ్ వార్తలు