Tech Tips in Telugu : మీ స్మార్ట్‌ఫోన్‌ను టీవీ రిమోట్‌గా ఇలా మార్చేయండి.. ఇదిగో సింపుల్ టిప్స్ మీకోసం..!

Tech Tips in Telugu : మీ టీవీ రిమోట్ పోయిందా? మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. సింపుల్‌గా మీ ఫోన్ ద్వారానే టీవీని ఆపరేట్ చేయొచ్చు. ఇంతకీ ఇదేలా పనిచేస్తుందంటే? పూర్తి వివరాలు మీకోసం..

Tech Tips in Telugu : మీ స్మార్ట్‌ఫోన్‌ను టీవీ రిమోట్‌గా ఇలా మార్చేయండి.. ఇదిగో సింపుల్ టిప్స్ మీకోసం..!

Tech Tips in Telugu _ How to turn your smartphone into TV remote

Tech Tips in Telugu : మీ టీవీ రిమోట్ పనిచేయడం లేదా? అయితే, కంగారుపడకండి.. కొత్త రిమోట్ అవసరం లేదు. మీ చేతిలో స్మార్ట్‌‌ఫోన్ ఉంటే చాలు.. టీవీ రిమోట్‌గా మార్చేయొచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. మీ గూగుల్ టీవీ యాప్‌తో ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఐఫోన్‌ను స్మార్ట్‌టీవీ రిమోట్‌గా మార్చేయడమే.. అది ఎలా అంటారా? మనమందరం రోజూ మన టీవీ రిమోట్‌ను ఎక్కడో పారేస్తుంటాం. కొన్నిసార్లు సోఫా లేదా మంచం కింద పడిపోయి ఉంటుంది. మరి కొన్నిసార్లు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు సరదాగా దాచిపెడుతుంటారు. రిమోట్‌ లేకపోతే మనం టీవీ ఛానళ్లను మార్చడం కుదరదు.

Read Also : Samsung Phones High Risk : శాంసంగ్ యూజర్లకు హైరిస్క్ వార్నింగ్.. మీ ఫోన్ సేఫ్‌గా ఉండాలంటే వెంటనే అప్‌‌డేట్ చేసుకోండి..!

అయితే, మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను మీ టీవీ రిమోట్‌గా ఉపయోగించవచ్చు. మీరు విన్నది నిజమే. గూగుల్ టీవీ యాప్‌తో మీ స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగించి మీ ఆండ్రాయిడ్ ఆధారిత టీవీని కంట్రోల్ చేయొచ్చు. దీని అర్థం.. మీరు లేచి రిమోట్‌ని కనుగొనాల్సిన అవసరం లేకుండానే ఛానెల్‌లను మార్చవచ్చు. వాల్యూమ్‌ను తగ్గించడం లేదా పెంచడం చేయవచ్చు. మీకు ఇష్టమైన యాప్‌లను కూడా ఓపెన్ చేయొచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటిలోనూ ఇది పని చేస్తుంది. మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఐఫోన్‌లో గూగుల్ టీవీ యాప్‌ని సెటప్ చేయడానికి మీ స్మార్ట్‌ఫోన్‌ను టీవీ రిమోట్‌గా ఉపయోగించడానికి ఈ కిందివిధంగా ప్రయత్నించవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను టీవీ రిమోట్‌గా ఎలా మార్చాలంటే? :
* గూగుల్ ప్లే స్టోర్‌ని ఓపెన్ చేసి గూగుల్ టీవీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
* టీవీ, ఫోన్ ఒకే వై-ఫై నెట్‌వర్క్‌లో ఉన్నాయని నిర్ధారించుకోండి.
* మీ టీవీకి వై-ఫై లేకపోతే, మీ ఫోన్ టీవీని కనెక్ట్ చేసేందుకు బ్లూటూత్‌ని కూడా ఉపయోగించవచ్చు.
* గూగుల్ టీవీ యాప్‌ను ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత దిగువ కిందిభాగంలో ఉన్న రిమోట్ బటన్‌ను నొక్కండి.
* యాప్ డివైజ్‌‌ల కోసం స్కాన్ చేస్తుంది. మీ టీవీని గుర్తించిన తర్వాత జాబితా నుంచి దాన్ని ఎంచుకోండి.
* టీవీ స్క్రీన్‌పై కోడ్ కనిపిస్తుంది. యాప్‌లో కోడ్‌ని ఎంటర్ చేసి పెయిర్ ఆప్షన్ నొక్కండి.
* మీ ఫోన్‌ను మీ టీవీతో పెయిర్ చేసిన తర్వాత సాధారణ రిమోట్‌తో కంట్రోల్ చేసినట్టుగానే టీవీని కంట్రోల్ చేసేందుకు ఉపయోగించవచ్చు.

Tech Tips in Telugu _ How to turn your smartphone into TV remote

smartphone into TV remote

మీ ఐఫోన్‌ను టీవీ రిమోట్‌గా ఎలా మార్చాలంటే? :
* మీ ఐఫోన్, టీవీ ఒకే వై-ఫై నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయిందని నిర్ధారించుకోండి.
* యాప్ స్టోర్ నుంచి గూగుల్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయండి.
* మీ ఐఫోన్‌లో గూగుల్ టీవీ యాప్‌ను ఓపెన్ చేయండి.
* స్క్రీన్ కుడి దిగువ మూలన ఉన్న టీవీ రిమోట్ ఐకాన్ నొక్కండి.
* యాప్ ఆటోమేటిక్‌గా మీ టీవీ కోసం సెర్చ్ చేయడం ప్రారంభిస్తుంది.
*  టీవీని కనుగొనలేకపోతే డివైజ్ కోసం స్కాన్ బటన్‌పై నొక్కండి.
* టీవీ కనుగొన్న తర్వాత దాన్ని ఎంచుకుని టీవీ స్క్రీన్‌పై కనిపించే 6-అంకెల కోడ్‌ను ఎంటర్ చేయండి.
* ఐఫోన్‌ను మీ టీవీకి కనెక్ట్ చేసేందుకు పెయిర్‌పై నొక్కండి.
* ఐఫోన్‌ని మీ టీవీకి కనెక్ట్ చేసిన తర్వాత సాధారణ రిమోట్ కంట్రోల్‌తో మీ టీవీని కంట్రోల్ చేసినట్టుగానే దాన్ని ఉపయోగించవచ్చు.
* మీరు ఛానెల్‌ని మార్చడానికి, వాల్యూమ్‌ను ఎడ్జెస్ట్ చేయడానికి ప్లేబ్యాక్‌ని కంట్రోల్ చేయడానికి మరిన్నింటికి యాప్‌ని ఉపయోగించవచ్చు.

Read Also : Lava Yuva 3 Pro Specifications : అత్యంత సరసమైన ధరకే లావా యువ 3 ప్రో ఫోన్.. స్పెషిఫికేషన్లు, ధర ఎంతంటే?