Apple iPhone 16 : ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్ ఈవెంట్ ఎప్పుడో తెలిసిందోచ్.. ఫీచర్లు, ధర పూర్తి వివరాలు మీకోసం..!
Apple iPhone 16 Launch : ఆపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16ప్రో మ్యాక్స్‌తో సహా 4 మోడళ్లను ప్రవేశపెడుతుంది. స్టాండర్డ్ మోడల్‌లు మైనర్ అప్‌గ్రేడ్‌లను అందుకుంటాయని భావిస్తున్నారు.

Apple announces iPhone 16 event, launch set for September 9
Apple iPhone 16 Launch : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఎట్టకేలకు ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ ఈవెంట్‌ను ప్రకటించింది. నెలల తరబడి లీక్‌లు, పుకార్ల తర్వాత, కంపెనీ 2024 ఐఫోన్‌లు త్వరలో రాబోతున్నట్లు ధృవీకరించింది. ఆపిల్ రహస్య మెసేజ్‌తో ప్రత్యేక ఆపిల్ ఈవెంట్ ఆహ్వానాలను పంపడం ప్రారంభించింది. ఐఫోన్ 16 లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 9న జరగనుంది. అంతకుముందు ఆపిల్ బ్రాండ్ కొత్త ఐఫోన్ 16 సిరీస్‌ను సెప్టెంబర్ 10న లాంచ్ చేస్తుందని పుకార్లు వచ్చాయి. అయితే, ఆపిల్ చివరి నిమిషంలో కొన్ని మార్పులు చేసి ఉండవచ్చు.
Read Also : Telegram CEO : టెలిగ్రామ్ సీఈఓ అరెస్ట్‌తో మిస్టీరియస్ మహిళకు లింకేంటి? ఇంతకీ, ఎవరీ జూలీ వావిలోవా?
అధికారిక ఆపిల్ ప్రకటనలో ఆపిల్ లోగో కూడా ఒక సీక్రెట్ మెసేజ్ సూచిస్తోంది. “గ్లోటైమ్” చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. కానీ దీని అర్థం ఏమిటో ఎవరికీ తెలియదు. రాబోయే రోజుల్లో ఐఫోన్ 16 లాంచ్ ఈవెంట్‌కు ముందు దీనిపై స్పష్టత రానుంది. ఆపిల్ పార్క్‌లో ఫుల్ ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ ఈవెంట్‌ను ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో లైవ్ స్ట్రీమింగ్ వీక్షించవచ్చు. భారత్‌లో ఐఫోన్ 16 ఈవెంట్ ప్రతి ఏడాది మాదిరిగానే రాత్రి 10:30కి ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్ ఆపిల్ అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది.
ఐఫోన్ 16 సిరీస్ స్పెషిఫికేషన్లు ( అంచనా) :
ఆపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16ప్రో మ్యాక్స్‌తో సహా 4 మోడళ్లను ప్రవేశపెడుతుంది. స్టాండర్డ్ మోడల్‌లు మైనర్ అప్‌గ్రేడ్‌లను అందుకుంటాయని భావిస్తున్నారు. స్టాండర్డ్, ప్లస్ మోడల్‌లు పాత డిస్‌ప్లేలు, కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. అయితే, కొత్త చిప్‌సెట్, భారీ బ్యాటరీ, కొత్త వర్టికల్ బ్యాక్ కెమెరా లేఅవుట్, కొత్త యాక్షన్ బటన్‌ను అందిస్తాయి.
మరోవైపు, ప్రో మోడల్‌లు భారీ కెమెరా అప్‌గ్రేడ్‌లు, సన్నగా ఉండే డిజైన్, బెజెల్స్‌తో కూడిన భారీ డిస్‌ప్లే, కొత్త చిప్‌సెట్, భారీ బ్యాటరీతో వస్తాయి. ఆపిల్ స్పీడ్ ఛార్జింగ్‌ని అందిస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి తెలియదు. అన్ని ఐఫోన్ 16 మోడల్‌లు ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్టుతో వస్తాయని చెప్పవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ ధర (లీక్) :
అధికారిక ఆపిల్ ఈవెంట్‌కు ముందు ధర వివరాలు కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఐఫోన్ 16 బేస్ మోడల్ ధర 799 డాలర్లు (భారత్‌లో సుమారు రూ. 67,100)గా ఉంది. లీక్‌ల ప్రకారం.. భారీ ఐఫోన్ 16 ప్లస్ ధర 899 డాలర్లు (సుమారు రూ. 75,500) కావచ్చు. 256జీబీ కలిగిన ఐఫోన్ 16 ప్రో ధర 1,099 డాలర్లు (సుమారు రూ. 92,300)గా ఉండవచ్చు. అదే స్టోరేజ్‌తో ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ 1,199 డాలర్లు (సుమారు రూ. 1,00,700) వద్ద ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
కస్టమ్స్ ఛార్జీలు, ఇతర అంశాల కారణంగా ప్రతి లాంచ్‌లో మాదిరిగానే భారత మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు కంపెనీ కొత్త వాచీలు, ఎయిర్‌పాడ్‌లను కూడా ప్రకటించాలని భావిస్తున్నారు. ఐఫోన్ 16 లాంచ్ ఈవెంట్ తర్వాత ఆపిల్ 2024 అక్టోబర్‌లో చివరి ఈవెంట్‌ను హోస్ట్ చేయనుంది. కొత్త సెట్ మ్యాక్‌లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.
Read Also : Infinix Note 40 Racing Edition : ఇన్ఫినిక్స్ నోట్ 40 రేసింగ్ ఎడిషన్ వచ్చేసిందోచ్.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?