Google Pay వాడుతున్నారా? : మీ బ్యాంక్ అకౌంట్లు ఈజీగా చెక్ చేసుకోవచ్చు

గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్. త్వరలో గూగుల్ పే యాప్ పై.. మీ బ్యాంకు అకౌంట్లను చెక్ చేసుకోనే సదుపాయం రానుంది. వాల్ స్ట్రీట్ జనరల్ రిపోర్టు ప్రకారం.. గూగుల్ పే కంపెనీ కూడా ఆపిల్, ఫేస్ బుక్ బాటలో పేమెంట్స్ విధానంపై దృష్టిసారించింది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం 2020లో ఈ కొత్త సదుపాయాన్ని యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. బ్యాంకులతో భాగస్వామ్యానికి సంబంధించి కూడా గూగుల్ పే ప్లాన్ చేస్తోంది.
2020లో కోడ్ పేరు కింద ‘Cache’ అనే ప్రాజెక్టును లాంచ్ చేయనుంది. ఇప్పటికే గూగుల్.. తమ యూజర్ల ఆర్థిక పరమైన డేటాను అమ్మేందుకు ప్రయత్నం చేయబోమని స్పష్టత ఇచ్చేసింది. ప్రస్తుత బ్యాంకింగ్ ఛానళ్ల ద్వారా పేమెంట్స్ జరిపేందుకు గూగుల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
WSJ ప్రకారం.. ఈ అకౌంట్లన్నీ సిటీగ్రూపు, స్టాన్ ఫోర్డ్ ఫెడరల్ క్రెడిట్ యూనియన్ ద్వారా నిర్వహించనుంది. సాంప్రదాయక అకౌంట్ నిబంధనలు మాదిరిగానే ఈ అకౌంట్లకు నిబంధనలను అనువర్తింప చేయనున్నట్టు రిపోర్టులు తెలిపాయి.
మరోవైపు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కూడా క్రిప్టోకరెన్సీ లిబ్రా పేమెంట్స్‌పై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి తమ వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, మెసేంజర్, ఫేస్ బుక్ యాప్ లపై కూడా పేమెంట్స్ సిస్టమ్స్ లాంచ్ చేసింది.
ఈ ఏడాది ఆరంభంలో టెక్ దిగ్గజం ఆపిల్ కూడా గోల్డ్ మ్యాన్ సాచ్ భాగస్వామ్యంతో ఆపిల్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తోంది. క్రెడిట్ లిమిట్స్ నిర్ధారించే విషయంలో గోల్డ్ మ్యాన్ సాచ్.. లింగ వివక్షత ఆరోపణలు ఎదుర్కొంది. దీనిపై న్యూయార్క్ డిపార్ట్ మెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దర్యాప్తు ప్రారంభించింది.