Google Pixel 8 Sale
Google Pixel 8 Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ కొనేసుకోవచ్చు. ఐఫోన్ కొనే బదులు ఈ పిక్సెల్ 8 కొనేసుకోవడం బెటర్. ఎందుకంటే..
ఈ ప్రీమియం ఫోన్ అసలు ధర రూ. 83వేలు ఉంటుంది. ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్, ఎక్స్జేంజ్ ఆఫర్లతో కేవలం రూ. 23,500కే లభ్యమవుతోంది.
ఐఫోన్ మాదిరిగానే పిక్సెల్ ఫోన్ కూడా బాగా క్రేజ్ ఉంది. కెమెరా-సెంట్రిక్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లలో గూగుల్ పిక్సెల్ ఒకటి. ఈ పిక్సెల్ ఫోన్ సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్‌లతో పోలిస్తే ఎక్కువ ధర ఉంటాయి. చాలా మందికి ఈ పిక్సెల్ ఫోన్లను కొనలేరు. అయితే, మీరు ఐఫోన్ (iOS) నుంచి ఆండ్రాయిడ్‌కి మారాలని చూస్తుంటే మాత్రం ఈ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ను అద్భుతమైన ఆప్షన్. మీ బడ్జెట్ ధరకే సొంతం చేసుకోవచ్చు.
గూగుల్ గత ఏడాదిలో పిక్సెల్ 9 సిరీస్‌ను లాంచ్ చేసింది. పాత మోడళ్ల ధరలను భారీగా తగ్గించింది. మరింత సరసమైన ధరకు గూగుల్ పిక్సెల్ 8 వస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గింది. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఔత్సాహికులకు ఈ పిక్సెల్ ఫోన్ బెస్ట్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ ఆఫర్ల వివరాలను ఇప్పుడు చూద్దాం..
గూగుల్ పిక్సెల్ 8 డిస్కౌంట్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 8 (256GB) ధర రూ.82,999కి లిస్టు అయింది. అయితే, 42 శాతం తగ్గింపు పొందవచ్చు. మీరు ఇప్పుడు ఈ పిక్సెల్ 8 కేవలం రూ.47,999కి కొనుగోలు చేయవచ్చు. అదనంగా, మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. మీకు 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా వస్తుంది.
ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు మారాలని ప్లాన్ చేస్తున్న వినియోగదారులకు ఈ ఆఫర్ బెస్ట్. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా ఈ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.23,500 ధరకే కొనుగోలు చేయవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌లపై ట్రేడ్ ద్వారా కంపెనీ కస్టమర్లకు రూ.26,200 వరకు ఆఫర్ అందిస్తోంది.
మీ దగ్గర ఐఫోన్ 13 మంచి వర్కింగ్ స్టేటస్ ఉంటే.. మీరు రూ.24,700 ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు. దాంతో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.23,299కి తగ్గుతుంది. మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, ఫిజికల్ స్టేటస్ ద్వారా ఎక్స్ఛేంజ్ వాల్యూ మరింత పొందవచ్చు.
గూగుల్ పిక్సెల్ 8 స్పెసిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 8 అల్యూమినియం ఫ్రేమ్ డిజైన్‌ను కలిగి ఉంది, IP68 రేటింగ్‌తో వస్తుంది. వాటర్, డెస్ట్ నిరోధకతను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14తో ప్రీ ఇన్‌స్టాల్ అయి ఉంటుంది. అవసరమైతే లేటెస్ట్ వెర్షన్‌లకు కూడా అప్‌గ్రేడ్ చేయవచ్చు.
Read Also : Apple iPhones : ఐఫోన్ ప్రియులకు బిగ్ షాక్.. ఇకపై ఆపిల్ ఫోన్ ధర రూ. 3 లక్షలపైనే.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!
ఈ పిక్సెల్ ఫోన్ పవర్ కోసం గూగుల్ టెన్సర్ G4 చిప్‌సెట్ కలిగి ఉంది. పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 8లో 50+ 48MP సెన్సార్లతో కూడిన డ్యూయల్ కెమెరా సిస్టమ్, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10.5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ పిక్సెల్ ఫోన్ 27W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4700mAh బ్యాటరీతో వస్తుంది.