Google Pixel 9 Pro XL
Google Pixel 9 Pro XL : పిక్సెల్ ఫ్యాన్స్ కోసం అద్భుతమైన డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. మార్కెట్లో అత్యంత ప్రీమియం ఆండ్రాయిడ్ (Google Pixel 9 Pro XL) స్మార్ట్‌ఫోన్‌లలో ఇదొకటి. ప్రస్తుతం ఆకర్షణీయమైన తగ్గింపుతో లభ్యమవుతుంది.
ఈ ఫోన్ కొనుగోలుపై ఎలాంటి ఎక్స్ఛేంజ్ అవసరం లేదు. రిలయన్స్ డిజిటల్ రూ. 42వేల కన్నా ఎక్కువగా తగ్గింపును అందిస్తోంది. పాత పిక్సెల్ నుంచి అప్‌గ్రేడ్ చేస్తున్నా లేదా మరో బ్రాండ్ నుంచి మారుతున్నా ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.
గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ఆఫర్లు :
ఈ పిక్సెల్ ఫోన్ 256GB స్టోరేజ్, 16GB ర్యామ్, ఒబిసిడియన్ కలర్ కలిగి ఉంది. భారత మార్కెట్లో రూ.1,24,999కి లాంచ్ అయింది. రిలయన్స్ డిజిటల్ ఈ ఫోన్ కేవలం రూ.94,999కి విక్రయిస్తోంది. నేరుగా రూ.30వేలు డిస్కౌంట్ అందిస్తోంది.
ఈఎంఐ లావాదేవీల కోసం IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని వాడితే.. అదనంగా 7.5శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ రూ.12,500 వరకు పొందవచ్చు. ఫైనల్ ధర కేవలం రూ.82,499 అవుతుంది. మొత్తం రూ.42,500 సేవ్ చేసుకోవచ్చు.
పిక్సెల్ 9 ప్రో XL ఫీచర్లు, స్పెసిఫికేషన్లు (Google Pixel 9 Pro XL) :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్ 6.7-అంగుళాల LTPO ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. 3,000 నిట్‌ల బ్రైట్‌నెస్ వద్ద గరిష్టంగా ఉంటుంది. HDR-రెడీ, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. గూగుల్ AI-ఆధారిత కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. OISతో 50MP మెయిన్ సెన్సార్, 48MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్ అందించే 48MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 42MP ఫ్రంట్ కెమెరా ఉంది. పిక్సెల్ 9 ప్రో XL టెన్సర్ G4 చిప్‌పై రన్ అవుతుంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఏఐ ఆధారిత అప్ గ్రేడ్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5060mAh బ్యాటరీని కలిగి ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.