Top 5 Smartphones : 7000mAh భారీ బ్యాటరీతో టాప్ 5 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్లు కొనేసుకోవచ్చు..!

Top 5 Smartphones : 7000mAh భారీ బ్యాటరీ కలిగిన స్మార్ట్‌ఫోన్లలో టాప్ 5 లేటెస్ట్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏ ఫోన్ కావాలో మీరే డిసైడ్ చేసుకోండి.

Top 5 Smartphones : 7000mAh భారీ బ్యాటరీతో టాప్ 5 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్లు కొనేసుకోవచ్చు..!

Top 5 Smartphones

Updated On : June 23, 2025 / 6:06 PM IST

Top 5 Smartphones : కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? 2025లో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్ అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉన్నాయి. అందులోనూ భారీ బ్యాటరీతో లాంగ్ టైమ్ (Top 5 Smartphones) బ్యాకప్ అందించే బ్రాండ్ల ఫోన్లు కూడా చాలానే ఉన్నాయి. 7000mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి.

ప్రధానంగా ఐక్యూ నియో 10, రియల్‌మి GT 7, వివో T4 5G, ఒప్పో K13 5G, ఐక్యూ Z10 5G జాబితాలో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి. భారీ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు, ధరలకు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

Read Also : Vivo Waterproof Phone : ఈ కొత్త Vivo వాటర్ ప్రూఫ్ 5G ఫోన్ భలే ఉంది భయ్యా.. నీళ్లలో తడిసినా చెక్కుచెదరదు.. ధర కూడా చాలా తక్కువే..!

iQOO నియో 10 :
ఈ ఐక్యూ ఫోన్ 7,000mAh బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. ఐక్యూ నియో 10 ఫోన్ 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8S జెన్ 4 ఆక్టా కోర్ ప్రాసెసర్ కలిగి ఉంది.

ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS15 ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉంది. ఐక్యూ నియో 10 ఫోన్ 8GB+128GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 31,999, 8GB+256GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 33,999, 12GB+256GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 35,999, 16GB+512GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 40,999కు పొందవచ్చు.

రియల్‌మి GT 7 :
ఈ రియల్‌మి ఫోన్ 7,000mAh బ్యాటరీతో 120W వద్ద ఛార్జ్ చేయవచ్చు. 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 9400e చిప్‌సెట్ పవర్ అందిస్తుంది. ప్రైమరీ కెమెరా 50MP, రియల్‌మి GT 7 మోడల్ 8GB+256GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ.39,999, 12GB+256GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ.42,999, 12GB+512GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ.46,999కు లభ్యమవుతుంది.

వివో T4 5G :
ఈ వివో 5G ఫోన్ 7,300mAh బ్యాటరీని 90W వద్ద ఛార్జ్ చేయవచ్చు. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 4nm ఆక్టా కోర్ ప్రాసెసర్ కలిగి ఉంది. 1,080 x 2,392 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.77-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ క్వాడ్ కర్వ్డ్ స్క్రీన్ కలిగి ఉంది. 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999, 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999, 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999కు పొందవచ్చు.

ఒప్పో K13 5G :
ఈ 5G ఫోన్ 7000mAh బ్యాటరీ, (Top 5 Smartphones) 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తుంది. 6.67-అంగుళాల ఫుల్ HD ప్లస్ అమోల్డ్ స్క్రీన్ 2400 x 1080 పిక్సెల్‌ రిజల్యూషన్‌ అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4, 4nm మొబైల్ ప్లాట్‌ఫామ్ 8 కోర్లకు పవర్ అందిస్తుంది. ఈ ఫోన్ 8GB+128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 17,999 కాగా, 8GB+256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 19,999కు కొనేసుకోవచ్చు.

Read Also : Baal Aadhaar Card : ‘బాల్ ఆధార్’ కార్డు ఏంటి? 5 ఏళ్ల లోపు పిల్లలకు ఎలా పొందాలి? ఏయే డాక్యుమెంట్లు అవసరం? ఫుల్ ప్రాసెస్ ఇదిగో..!

ఐక్యూ Z10 5G :
ఐక్యూ Z10 5G ఫోన్ 7,300mAh బ్యాటరీని 90W వద్ద ఛార్జ్ చేయవచ్చు. 6.77-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 387ppi పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది. కోర్ స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 3 చిప్ పవర్ అందిస్తుంది. ఈ ఫోన్ 8GB+128GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 21,999కు అందిస్తుంది. 8GB+256GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 23,999, 12GB+256GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 25,999కు పొందవచ్చు.