Vivo Waterproof Phone : ఈ కొత్త Vivo వాటర్ ప్రూఫ్ 5G ఫోన్ భలే ఉంది భయ్యా.. నీళ్లలో తడిసినా చెక్కుచెదరదు.. ధర కూడా చాలా తక్కువే..!

Vivo Waterproof Phone : వివో ఫోన్ కొంటున్నారా? కొత్త వివో వాటర్ ప్రూఫ్ ఫోన్ ఇదిగో.. వివో Y29t 5G ఫోన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది.

Vivo Waterproof Phone : ఈ కొత్త Vivo వాటర్ ప్రూఫ్ 5G ఫోన్ భలే ఉంది భయ్యా.. నీళ్లలో తడిసినా చెక్కుచెదరదు.. ధర కూడా చాలా తక్కువే..!

Vivo Waterproof Phone

Updated On : June 23, 2025 / 5:14 PM IST

Vivo Waterproof Phone : వివో లవర్స్ మీకోసమే.. వివో నుంచి కొత్త వాటర్ ఫ్రూప్ ఫోన్ వచ్చేసింది. వివో Y29t 5G ఫోన్ సైలెంట్‌గా లాంచ్ అయింది. అద్భుతమైన కెమెరా, బ్యాటరీతో (Vivo Waterproof Phone) పాటు, ఈ ఫోన్ ఆకర్షణీయమైన ప్రాసెసర్‌ను కలిగి ఉంది. IP64 రేటింగ్ కూడా ఉంది. వాటర్ పడినా డస్ట్ పడినా చెక్కుచెదరదు.. వివో Y29 సిరీస్‌ను ఇతర దేశాలలో కూడా విస్తరిస్తోంది.

ఈ సిరీస్‌లో ఇప్పటివరకు Y29 (4G), Y29 5G, Y29s 5G వేరియంట్‌లు ఉన్నాయి. కంపెనీ ఇప్పుడు మలేషియాలో తక్కువ ధరలో వివో Y29t 5G ఫోన్ రిలీజ్ చేసింది. ఇతర వివో Y29 సిరీస్ మోడళ్ల మాదిరిగానే వివో Y29t బిగ్ డిస్‌ప్లే, లాంగ్ బ్యాటరీ కలిగి ఉంది. ఈ వివో వాటర్ ప్రూఫ్ ఫోన్ ఫుల్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు, ధర, లభ్యత వివరాలపై ఓసారి లుక్కేయండి.

ధర, లభ్యత వివరాలు :
మలేషియాలో వివో Y29t 5G ఫోన్ ధర 1,099 MYR లేదా దాదాపు రూ. 22,365 ఉంటుంది. ఈ జాడే గ్రీన్, టైటానియం గోల్డ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ ఫోన్ ఏయే మార్కెట్లలో లాంచ్ అవుతుందో క్లారిటీ లేదు.

వివో Y29t 5G స్పెషిఫికేషన్లు (Vivo Waterproof Phone) :
వివో (1600 × 720) పిక్సెల్‌ రిజల్యూషన్‌తో 6.74-అంగుళాల LCD స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్, 260 పిక్సెల్ సాంద్రత, హై బ్రైట్‌నెస్ మోడ్‌లో గరిష్టంగా 570 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్సిటీ 6300 ప్రాసెసర్ కూడా ఉంది. 256GB వరకు eMMC 5.1 స్టోరేజీ, 6GB లేదా 8GB LPDDR4X ర్యామ్ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 15W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. భారీ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : EPFO UAN Generation : EPFO బిగ్ అప్‌డేట్.. ఇకపై ఫేస్ అథెంటికేషన్‌తో మీరే UAN క్రియేట్ చేయొచ్చు.. ఆటో-యాక్టివేట్.. ప్రాసెస్ ఇదిగో..!

వివో Y29t 5Gలో 50MP ప్రైమరీ సెన్సార్ ఉండగా, ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. 0.08MP ఆక్సిలరీ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ సైడ్ 5MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15 ఫోన్‌కు పవర్ అందిస్తుంది. బరువు 202 గ్రాములు, సైజు 167.30 x 76.95 x 8.19 మిమీ ఉంటుంది. IP64 రేటింగ్ కలిగి ఉంది. మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫైడ్ MIL-STD-810H అందిస్తుంది.

మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లు :
వివో Y29t 5G ఫోన్ కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. మైక్రో SD కార్డ్ స్లాట్, డ్యూయల్ సిమ్ 5G, మల్టీ-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, NFC, USB-C వంటి ఫీచర్లు కలిగి ఉంది. వివో Y29t ఫోన్ ఇతర వివో Y29 వెర్షన్ల కన్నా 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది.